కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ ప్రియాంక.. లోక్ సభకు పోటీ కూడా ఇక్కడ నుంచే?!

Publish Date:Jun 6, 2023

Advertisement

హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు  తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. వాస్తవానికి చాలా కాలంగా ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.  

ఒక దశలో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి, పతాక స్థాయికి చేరిన సమయంలో ప్రియాంక జోక్యంతోనే ఆ వివాదం సర్దు మణిగిందని అంటారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు, ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన తూటాల నేపధ్యంలో తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు.  అయితే, ఆ సమయంలో ప్రియాంక జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్ళారని అంటారు. అయితే అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే  కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అందుకే కావచ్చు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక చూపిన చొరవే కారణమని అంటారు.

అలాగే రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రేకు బాధ్యతలు అప్పగించడం వెనక ప్రియాంక పాత్ర కీలకమని అంటారు.    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  విజయంపై ధీమాతో ఉంది. మిగిలిన పార్టీల కంటే ఒకటి రెండు అడుగులు ముందుంటోంది. ఎన్నికల సమాయత్తంలో కానీ, వ్యూహాలలో కానీ ఈ సారి కాంగ్రెస్ వేగం పెరిగింది.  కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తుంటే, కర్నాటక ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.  సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటన చేస్తే.. ఇప్పుడు  ‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతను టార్గెట్ చేసింది.  

అన్ని వర్గాల ప్రజానీకానికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రియాంక పర్యటన  ఇలా ముగిసిందో లేదో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలలో శ్రీమతి గాంధీ వారసురాలిగా పార్టీ శ్రేణులు భావించే  ప్రియాంకా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం ఆమె మెదక్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారని చెబుతున్నారు.  1980 మధ్యంతర ఎన్నికలలో ఇందిరాగాంధీ రాయ్‌బరేలీతో పాటు తెలంగాణలోని మెదక్ నుంచి కూడా పోటీ చేశారు. తన సొంత రాష్ట్రమైన రాయ్‌బరేలీలో ఏడు వేల మెజారిటీ తెచ్చుకుంటే, మెదక్ నుంచి  రెండు లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెను తెలంగాణ  ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ప్రియాంక పోటీ చేసినా అదే ఫలితం వస్తుందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో చాలా బలంగా వ్యక్తమౌతోంది.  

ప్రియాంకను ‘ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ గా రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ప్రియాంక తెలంగాణ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ అమాంతం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  మొత్తానికి ప్రియాంక తెలంగాణలో పోటీ కోసం రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేశారని సమాచారం.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న సానుభూతిని  క్యాష్ చేసుకోవడంలో పార్టీ  రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. అయితే పీసీసీ చీఫ్  రేవంత్ ఈ సారి మాత్రం అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ విషయంలో సీరియస్‌గానే వ్యవహరిస్తోంది.

ఇప్పటికే రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు.  అన్నిటికీ మించి  ప్రియాంకా గాంధీ  యూత్ డిక్లరేషన్ పార్టీ శ్రేణుల్లో  ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ సభ  గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీజేపీని ఢీ కొట్టలేక చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటోందట. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ప్రియాంకను కీలకంగా మార్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే ప్రియాంక తెలంగాణలో పర్యటించారని సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే.. మున్ముందు ఆమెను తెలంగాణ ఇన్‌చార్జిగా కూడా నియమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.  అలాగే ఇంత కాలం అటా ఇటా అంటూ ఊగుతూ వస్తున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా తమ ద్వైదీ భావానికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ గూటికి చేరాలన్న కృత నిశ్చయానికి వచ్చేశారని చెబుతున్నారు. వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంటున్నారు.

ఈ నెల 25న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరుతారని చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ ను, బీజేపీని డీలా పడేటట్లు చేస్తే కాంగ్రెస్ లో మాత్రం కొత్త ఊపు, ఉత్సాహానికి కారణమైందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈ సారి తెలంగాణలో తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలన్నీ ప్రియాంకా గాంధీపైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఆమె పోటీకి దిగడం ఖాయమన్న ప్రకటన వెలువడితే.. రాష్ట్రంలో రాజకీయాలు కాంగ్రెస్ అనుకూలంగా చాలా వేగంగా మారిపోతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.