Publish Date:Jul 30, 2025
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది. రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో ఆరు రోజుల పాటు మీనాక్షినటరాజన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లు గురువారం (జులై 31) నుంచి వచ్చే నెల 6 వరకూ రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ ఖరారైంది. అయితే ఇంతలో బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హస్తిన యానం ఖరారైన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది.
అది పక్కన పెడితే మీనాక్షి నటరాజ్ చేపట్టదలచిన పాదయాత్రపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మీనాక్షి నటరాజ్ చేపట్టనున్న పాదయాత్ర పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడం అటుంచి.. పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో, శ్రేణుల్లో గట్టిగా వ్యక్తం అవుతోంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదీ కాకుండా ఈ పాదయాత్ర వలన ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఒక అవకాశం ఇవ్వడమే ఔతుందని అంటున్నారు. అలాగే పాదయాత్రను అడ్డుకునేందుకు విపక్షాలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లే ఔతుందని అంటున్నారు.
వాస్తవానికి పాదయాత్రను విపక్షాలు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను చాటేందుకు చేపడతాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే పాదయాత్రలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని అంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పుడు సమస్యలు తెలుసుకోవడాని పార్టీ పాదయాత్ర చేయడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-congress-incharge-meenakshi-natarajan-padayatra-postpone-39-203100.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.