రేవంత్ కే చాన్స్.. సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం

Publish Date:Dec 5, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి   అభ్యర్థి గా అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరునే ఖరారు చేసే చాన్స్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (డిసెంబర్ 6) లోగా తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని, అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.   సోమవారం (డిసెంబర్ 4) నుంచి సీఎం ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. హైదరాబాద్‌లోని ఎల్జా హోటల్‌లో డి. శివకుమార్‌తో పాటు ఇతర పరిశీలకులు ఎమ్యెల్యేలతో   విడివిడిగా కూడా మాట్లాడారు. ఆ తార్వత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకి హస్తినకు అంటే పార్టీ హైకమాండ్ కోర్టుకు చేరింది.

 ఎల్జా హోటల్ లో ఎంపిక విషయంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం డీకే శివకుమార్ సహా హైకమాండ్ పంపిన పరిశీలకులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆ వెంటే సీఎం అభ్యర్థి పదవిని ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తాను తన ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించడానికి హస్తిన వెళ్లినట్లు చెబుతున్నా... ఇప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గేతోనూ, అంతకు ముందు డీకే శివకుమార్ తోనూ కూడా భేటీ అయ్యారు.  అలాగే సీఎం పదవిని ఆశిస్తున్న  మల్లుభట్టి విక్రమార్కకూడా హస్తిన చేరుకుని తన ప్రయత్నాలు తాను సాగిస్తున్నారు. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్ ఇప్పటికే టీపీసీసీ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఇప్పటికే ఖరారు చేసింది.  ఈ నేపథ్యంలోనే  మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. ఆరుసార్లు ఆయన ఎమ్యెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీపీసీసీ చీఫ్ గా కూడా పని చేశారు.

అలాగే మల్లుభట్టి విక్రమార్క సిఎల్‌పి నేతగా ఉన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్‌ విజయాన్ని కాంక్షిస్తూ  పాదయాత్ర కూడా చేపట్టారు.  అయితే వారిరువురూ కూడా రేవంత్ రెడ్డిలా ప్రజాకర్షణ ఉన్న నేతలు కారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి రేవంత్‌ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కాంగ్రెస్‌కు తెలంగాణలో  విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగే స్థాయికి ఎదిగింది. అలాగే ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంలో రేవంత్ రెడ్డే ప్రధాన, కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నిర్వహించారు. అదే విధంగా అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. టీపీసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమాకాన్ని సీనియర్‌ నాయకులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆ తర్వాత అధిష్టానం సర్దుబాట్లు, బుజ్జగింపుల తర్వాత అందరూ ఐక్యంగా పనిచేశారు. అంతర్గత విమర్శలకు, పరస్పర విమర్శలకు స్వస్తి చెప్పి పార్టీ విజయానికి కృషి చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టడంలో సీనియర్లంతా విఫలమైన తరువాతే రేవంత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ బాధ్యతలను రేవంత్ కు అప్పగించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రేవంత్ దూకుడు ప్రదర్శించారు. కేసీఆర్ ను ఢీ కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను కూడగట్టడంలో విజయం సాధించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఒక్క సీటు కూడా ఆశించకుండా కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి రేవంత్ రెడ్డే కారణమనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి రేవంత్ రెడ్డికి తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రేవంత్ తెలంగాణ సీఎం అయితే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటే.. ఇప్పటి లాగే తెలుగుదేశం ఓటు కూడా కలిసి వస్తుందన్న భావనా వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసిందనీ, అధికారిక ప్రకటనను కూడా ఇంకెంత మాత్రం జాప్యం చేసే అవకాశాలు లేవనీ పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ హై కమాండ్ అధికారిక ప్రకటన విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తే.. జనం కాంగ్రెస్ కల్చరే ఇంత అనే భావనకు వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తున్నది. అందుకే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న భట్టి, ఉత్తమ్ లను బుజ్జగించేందుకు మాత్రమే నిన్న అధికారికంగా రేవంత్ ఎంపికను ప్రకటించలేదని అంటున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.