హైదరాబాద్ దాటించడానికే "తలసాని" శాఖ మార్పు..

Publish Date:Apr 26, 2016

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్టుగానే తన కేబినెట్‌లో శాఖలు మార్చారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ..కేవలం నాలుగు శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి సారథ్యం వహించనున్నారు. శాఖల మార్పులో మంత్రి తలసానికి షాక్ ఇచ్చారు సీఎం.

 

ఆయన ఇన్నాళ్లు పర్యవేక్షించిన వాణిజ్య పన్నుల శాఖను తొలగించి తనవద్దే ఉంచుకున్నారు. దానికి బదులుగా పశుసంవర్థక, మత్స్య శాఖలను ఇచ్చారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు పన్ను వసూళ్లలో లొసుగులకు అడ్డుకట్ట వేయడం, పాత బకాయిలను రాబట్టడంలో మరింత మెరుగైన విధానాలను అనుసరించాల్సిన అవసరముందని అందుకే ఆ శాఖను తన వద్దే ఉంచుకుంటున్నట్టు సీఎం చెప్పారు. అయితే ఇలాంటి కీలకశాఖ నుంచి తలసానిని తప్పించి అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్థక శాఖ కేటాయించడానికి బలమైన కారణాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

 

తలసాని శాఖ మారబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు పశుసంవర్థక శాఖకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన శాఖను ఇచ్చినా తలసాని దానిని సరిగా నిర్వర్తించలేదని సీఎం చేయించిన సర్వేలో తేలింది. దానికి తోడు తలసానితో పాటు ఆయన గారి పుత్రరత్నం వ్యాపారులు, అధికారులను వేధింపులకు గురిచేసినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య ఏకంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను నిర్బంధించి దందాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో తలసాని తన కుమారుణ్ణి వెనుకేసుకు రావడం జరిగింది. పైగా డిపార్ట్‌మెంట్‌పై ఆయనకు పట్టులేదని, సహచర మంత్రులంతా జిల్లా పర్యటనలకు వెళ్లి అధికారులతో సమీక్షలు జరపడం, సమస్యల పరిష్కారం లాంటివి లేకుండా ఎప్పడూ హైదరాబాద్‌ను పట్టుకుని వేలాడుతున్నారు తలసాని  వీటన్నింటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్న ముఖ్యమంత్రి సరైన టైం కోసం వెయిట్‌చేసి తలసానికి షాకిచ్చారు.

 

అటు ఆయన శాఖ మార్పుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తలసాని శాఖను మార్చి ముఖ్యమంత్రి మంచి పని చేశారని, అందుకు వ్యాపారులు, అధికారుల తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరి తలసాని, సీఎం నిర్ణయం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.