జానకిరామ్ దుర్మరణం.. కేసీఆర్, జగన్ సంతాపం
Publish Date:Dec 6, 2014
Advertisement
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం పట్ల తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతిని చెందాయి. జానకిరామ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. జానకిరామ్ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. నందమూరి హరికృష్ణకు జానకిరామ్ పెద్ద కుమారుడు. మొన్నటి వరకూ అమెరికాలో ఉండేవారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన ‘అతనొక్కడే’ సినిమాకి జానకిరామ్ నిర్మాతగా వ్యవహరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-39-40909.html
http://www.teluguone.com/news/content/telangana-cm-kcr-39-40909.html
Publish Date:Aug 1, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 31, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 30, 2026
Publish Date:Jul 29, 2026





