టిమ్స్‌లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం..!

Publish Date:Jul 2, 2026

Advertisement

 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

1. వీబీజీఆర్‌జీ చట్టం అమలుపై చర్చ..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీఆర్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలోని నిబంధనలపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని సమావేశంలో గుర్తుచేసుకుంది. మరోసారి తమ నిరసనను అధికారికంగా కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ భావనలకు విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫారసులను మంత్రివర్గం పరిశీలించింది. ఇతర రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయా అనే అంశంపై అధికారులను ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలు అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, చట్టంలోని నిబంధనలపై న్యాయపరంగా పోరాటం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, పార్లమెంట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని నిర్ణయించింది.

2. ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం..!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.

పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పథకాల అమలులో జవాబుదారీతనం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 430 ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

3. టిమ్స్ ఆసుపత్రుల్లో భారీ నియామకాలు..!

కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.

సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్‌వోసీలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

4. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.7,345 కోట్లు..!

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులకు రాష్ట్ర క్యాబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు రూ.7,345.12 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టుల సృష్టికి, ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

5. గిడ్డంగుల నిర్మాణానికి భూముల కేటాయింపు..!

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (TGSWC)కు మార్కెట్ రేటు ప్రకారం కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూముల్లో నిత్యావసర వస్తువుల నిల్వ కోసం ఆధునిక గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు.

6. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూముల కేటాయింపు..!

జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అదే విధంగా జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

By
en-us Political News

  
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.