Publish Date:May 30, 2025
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. తాజాగా మరో మారు రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లింది. రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ.. మళ్లీ ముహూర్తం ముడిపడలేదనీ, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదనీ హస్తిన వర్గాలు అంటున్నాయి. గతంలో గవర్నర్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారు అయి అర్ధాంతరంగా రద్దైప సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడటంతో అసలేం జరుగుతోంది? అధిష్ఠానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావహులను ఊరించి ఉసూరుమనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగాయి. ఇందు కోసం దాదాపు మూడు రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరో సారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్ఠానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం (జూన్ 30) హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే.. చావు కబురు చల్లగా అన్నట్లు హైకమాండ్ ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది.
అదే విధంగా పీసీసీ కార్యవర్గం విషయంలో కూడా అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ముఖ్యంగా మంతివర్గ విస్తరణలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైక మాండ్ యోచనగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రిపదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cabinet-expansipn-deferment-once-again-25-199001.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.