మళ్ళీ మొదటికొచ్చిన భేతాళ ప్రశ్న.. బీజేపీ అధ్యక్షుడు ఎవరు ?

Publish Date:May 24, 2025

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  ఇంకా  రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్  సినిమా చూపిస్తోంది.  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను  వెంటాడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండీ లేనట్టుగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్,కాదంటే బీఆర్ఎస్ పంచన చేరడం మినహా లెఫ్ట్ పార్టీలకు మరో దారి కనిపించడం లేదు. ఒక విధంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేక పోయినా, రాష్ట్ర రాజకీయాల్లో మెల్లమెల్లగా  రాజకీయ శూన్యత ఏర్పడే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 

ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభావం చూపగల పార్టీ ఏదైనా ఉందంటే..  అది బీజేపీ ఒక్కటే.  కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా..  కమల దళానికి అన్నీ ఉన్నాయి కానీ, సమర్ధ నాయకత్వమే కరవైంది. అలాగని నాయకులు లేరా అంటే ఉన్నారు. బీజేపీలో పుట్టి బీజేపీలో ఎదిగిన నాయకులు ఉన్నారు. కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఇతర పార్టీలలో ఎదిగొచ్చిన సీనియర్ నాయకులూ ఉన్నారు. అయితే.. నాయకుల మధ్య ఐక్యత లేదు. 

నిజానికి.. ఐక్యత లేక పోవడం వల్లనే 2023లో చేతిదాక వచ్చిన ముద్ద నోటికి చేరకుండానే జారి పోయింది. ఈ మాట అన్నది మీరో నేనో, ఇంకెవరో కాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ. అవును..  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు  తనను కలిసిన సందర్భంలో స్వయంగా మోదీనే చేతికి అందివచ్చిన అవకాశాన్ని రాష్ట నాయకులు  చేజార్చుకున్నారని అన్నారని  అప్పట్లో వార్తలొచ్చాయి. 

నిజానికి.. బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విబేధాలు,  అంతర్గత కుమ్ములాటల కారణంగానే, పార్టీ 2023 ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేక పోయిందని  అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ కారణంగానే పార్టీ అధిష్టానం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుని మార్చింది.  బండి సంజయ్ ని తప్పించి, కిషన్ రెడ్డి చేతికి  పార్టీ పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ నాయకత్వంలో తక్కువలో తక్కువ  కనీసం 25నుంచి 30 సీట్లు అవలీలగా గెలుస్తుందన్న ధీమాతో ఉన్న సమయంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి తప్పు చేసిందని  పార్టీలో ఇప్పటికీ ఆవేదన వ్యక్తమవుతోంది. 

ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఎందుకు, ఎవరి ప్రోద్భలంతో  తీసుకుందో ఏమో కానీ.. అది పార్టీ చరిత్రలో ఒక  చారిత్రక తప్పిదంగా మిగిలిపోయిందని పార్టీ పట్ల నిబద్దత గల సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు.  అలాగని కిషన్ రెడ్డి  అసమర్ధుడని కాదు. పార్టీ పట్ల ఆయనకు  విధేయత లేదనీ కాదు.   అయితే.. బండి సంజయ్ ను తప్పించడంతో   కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.  మరో వంక కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి బీఆర్ఎస్ కు అక్రమ సంబంధాన్నిఅంటగట్టింది. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ నాయకత్వం బండిని తప్పించారని, ప్రచారం సాగించింది.  బీజేపీకి వేసే ఓటు బీఆర్ఎస్ ఖాతాలోకి చేరుతుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విమర్శలను జనం విశ్వసించారు.  కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఫలితంగా, బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీనీ తాకింది. దీంతో 2019 లోక్ సభ, జీహెచ్ఎంసి ఎన్నికలు, దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ..  వెనక్కిపోయి, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ముందు కొచ్చింది. అదే ఊపులో అధికారాన్నీ  హస్తగతం  చేసుకుంది. బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది. అయితే.. ఆ తర్వాత ఆరేడు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ పుంజుకుంది. కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.   

సరే..  అదంతా చరిత్ర. గతం గతః అనుకున్నా..  ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కళ్ళు తెరిచిందా అంటే అదీ లేదు. కాషాయ పార్టీలో ఇప్పటికీ కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక  సంవత్సరకాలంగా  ఒక ప్రహసనంలాగా సాగుతోంది.  ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు, కొత్తకొత్త ఫార్ములాలు తెరపైకొస్తున్నాయి. కొంత కాలం పాత, కొత్త లెక్కలు..  ఆ తర్వాత బీసీ-ఓసీ ఈక్వేషన్లు.. ఇలా అనేక కోణాల్లో ఆలోచనలు అయితే సాగుతున్నాయి కానీ.  నిర్ణయం మాత్రం జరగలేదు. 

మరో వంక మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖారైనట్లు పార్టీలో ప్రచారం జరిగింది. నిజానికి స్వయంగా ఈటల కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. అయితే..  వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు  ఈటల పేరు ఖరారై, ఇక రేపోమాపో ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్న సమయంలో  పహల్గాం ఉగ్రదాడితో , ప్రకటన వాయిదా  పడింది. ఇప్పడు మళ్ళీ అంతా ఒకే అనుకుంటున్న సమయంలో  కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా.. టీఆర్ఎస్’ తొలి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన,ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది.  వచ్చే నెల (జూన్) 9 న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో మరో  ‘సారీ’ ప్రకటన వాయిదా పడవచ్చని అంటున్నారు. మరోవంక.. ఇదే సమయంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, డీకే అరుణ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  కానీ, ప్రధాన పోటీ మాత్రం ఇప్పటికీ..  ఈటల వర్సెస్ బండి గానే సాగుతోందని అంటున్నారు. అయితే చివరకు ఏమి జరుగుతుంది? బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది? అంటే, అదో సమాధానం లేని భేతాళ ప్రశ్న..అంటున్నారు.

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.