నిస్తేజంలో తెలంగాణ బీజేపీ

Publish Date:Jul 5, 2023

Advertisement

తెలంగాణ బీజేపీలో నిస్తేజం ఆవరించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర బీజేపీలో ప్రక్షాళన పేరిట హైకమాండ్ మంగళవారం (జూలై4) కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడంతో ఆయన రానున్న రోజులలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అది పక్కన పెడితే రాష్ట్ర పార్టీలో మాత్రం ఈ మార్పులపై ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. వ్యక్తిగతంలో ఖమ్మంలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఒకరు తమ అసంతృప్తి వ్యక్తం చేసినా శ్రేణుల్లో ఎటువంటి స్పందనా కనిపించలేదు. బండి సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్ లో అయితే తుపాను ముందు ప్రశాంతతలా పరిస్థితి ఉంది. కార్యకర్తలు, నాయకులు ఎవరూ బండి ఉద్వాసనకు నిరసన వ్యక్తం చేయడం కానీ, కిషన్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేయడం కానీ కనిపించలేదు. రాష్ట్ర నాయకులలో కూడా బండి తొలగింపుపై స్పందన లేదు,

కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై హర్షం లేదు. బీజేపీ సంప్రదాయానికి విరుద్ధంగా బయటి నుంచి వచ్చిన ఈటలకు కీలక పదవి ఇవ్వడంపై కూడా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఈటల మాత్రం మీడియా ముందుకు వచ్చి తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తాననీ, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాననీ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మాత్రం ఎలాంటి ఉత్సాహం, ఉత్తేజం కనిపించడం లేదు.

వాస్తవానికి బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన తరువాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పలు మార్లు బాహాటంగానే చెప్పారు. మోడీ అయితే వేదికపైనే బండి భుజం తట్టి మరీ అభినందనలు తెలిపారు. బండి  ఆధ్వర్యంలో  ప్రజాసంగ్రమ యాత్ర, నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగ మార్చ్​ వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతోపాటు అధికార పార్టీకి బీజేపీ దీటుగా ఎదిగింది.  అటువంటి బండి తొలగింపుతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో పార్టీ విజయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే ఈ నిస్తేజానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.