Publish Date:Apr 13, 2024
బీఆర్ఎస్ కు ఇటీవలి కాలంలో ఏదీ కలిసి రావడం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం నుంచి మొదలై నేతల వలసల నుంచి.. వచ్చే లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక వరకూ అన్నీ కష్టాలే ఎదుర్కొంటోంది. దీనికి తోడు బీఆర్ఎస్ బడా నేతలపై అవినీతి ఆరోపణలు ప్రజలలో వారి ప్రతిష్టను పలుచన చేసేశాయి. ఇప్పుడు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే చేవెళ్ల నుంచి గులాబీ బాస్ కేసీఆర్ శనివారం (ఏప్రిల్ 13)న ప్రారంభించారు. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వెలువడిన పలు ఫలితాలు రాష్ట్రంలో ముక్కోణపు పోరు ఖాయమని పేర్కొన్నాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో కాంగ్రెస్ పై చేయి సాధించే అవకాశం ఉందని చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందనీ, బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని అంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఆవాజ్ వెలువరించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు రెండు నుంచి నాలుగు స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే కూడా రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంటుందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 29.8శాతం ఓట్లతో ఆరు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఇక బీజేపీ 29.6శాతం ఓట్లతో ఐదు నుంచి ఏడు స్థానాలలో విజయం సాదిస్తుందనీ బీఆర్ఎస్ మాత్రం 24.3 శాతం ఓట్లతో రెండు నుంచి నాలుగు స్థానాలకు పరిమితమౌతుందని తెలంగాణ ఆవాజ్ సర్వే తేల్చింది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఆ ఇతరులు అంటే ఎంఐఎం అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. ఇక ఇప్పటికీ ఎటువైపు అన్నది లేలని తటస్థుల ఓట్ల శాతం 12.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని మరిచిపోయేలా లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ తాజా సర్వే గాలి తీసేసినట్లైంది. మొత్తం మీద బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కనీస స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-awaj-survey--say-brs-in-third-place-39-173760.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.