స‌భా స‌మ‌రం.. ఈసారి కేసీఆర్ హాజరా? గైర్హాజరా?!

Publish Date:Dec 4, 2024

Advertisement

తెలంగాణ‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని గ‌వ‌ర్న‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ సమావేశాలలో ప‌లు అంశాలు చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హిస్తార‌నేది ఈ నెల 9న జ‌రిగే బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. సంక్రాంతి త‌రువాత రైతు భ‌రోసా నిధులు వేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.  అందుకు సంబంధించిన విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌పై ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇప్ప‌టికే ప‌లు అంశాల‌తో కూడిన నివేదిక‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ అంశాల‌ను అసెంబ్లీలో చ‌ర్చించి అర్హులైన రైతుల‌కే రైతు భ‌రోసా ద‌క్కేవిధంగా ముందుకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. మ‌రోవైపు కొత్త‌గా తీసుకురానున్న ఆర్వోఆర్ చ‌ట్టంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతున్న కుల‌గ‌ణ‌న స‌ర్వే   గ‌ణాంకాల‌ను అసెంబ్లీలో పెట్టి చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై సంవ‌త్స‌రం పూర్తయ్యింది. ఈ సంవ‌త్స‌రకాలంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లుచేయ‌డంలో విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఈ క్ర‌మంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో  ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు   బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తరఫున నేతలు సభలో ఎంత గట్టిగా గళమెత్తినా, కేసీఆర్ సభకు గైర్హాజరైతే మాత్రం సభలో కాంగ్రెస్ దే పై చేయి కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ రెండు సందర్భాలలోనూ  కాంగ్రెస్‌, బీఆర్ఎస్ స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌ స్థాయిలో వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌భ‌లో లేక‌పోవ‌టంతో   కాంగ్రెస్‌  ఆధిప‌త్యం  స్పష్టంగా కనిపించింది.  బీఆర్ఎస్ త‌ర‌పున కేటీఆర్‌, హ‌రీశ్ రావు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా కాంగ్రెస్ స‌భ్యులు దీటుగా స‌మాధానం ఇచ్చారు.   కేసీఆర్ స‌భ‌లో ఉండిఉంటే పరిస్థితి వేరేలా ఉండేద‌న్న భావ‌న‌ గత రెండు సందర్భాలలోనూ బీఆర్ఎస్ శ్రేణులలో వ్య‌క్తం అయ్యింది.  కేసీఆర్ మాత్రం ఒక్క‌రోజు మిన‌హా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఒక్క‌రోజు మాత్ర‌మే అసెంబ్లీకి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌జ‌ల బ‌డ్జెట్ కాద‌ని, అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌కు, ప్రాజెక్టుల‌కు బ‌డ్జెట్ లో నిధులు కేటాయించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక నుంచి అసెంబ్లీకి వ‌స్తా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంతుచూస్తానంటూ కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో ఇక నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల‌కు కేసీఆర్ చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని.. రేవంత్ ఇక కాస్కో అంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అప్పట్లో పోస్టులు పెట్టాయి. అయితే, కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ ఎస్ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో నిరాశ‌కు గుర‌య్యాయి. 

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై అనేక అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ , కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి , విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో అవినీతికి జరిగిందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అంశాల‌పై విచార‌ణ‌కు సైతం  ఆదేశించారు. అయినా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు.  అధికారం కోల్పోయిన నాటినుంచి ఆయ‌న కేవ‌లం ఫాంహౌస్‌కే ప‌రిమితం అవుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ రావాల‌ని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే  గ‌తంలో కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాల‌ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావించగా.. ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇద్దామ‌ని, సంవ‌త్స‌ర కాలం స‌మ‌యం ఇచ్చిన త‌రువాత ప్ర‌భుత్వం ప‌నితీరు, విధానాల‌పై ప్ర‌శ్నిద్దామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి సంవ‌త్స‌ర కాలం పూర్తయ్యింది. అంటే కేసీఆర్ చెప్పిన గడువు ముగిసింది. దీంతో  ఈనెల 9నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతారా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. బీఆర్ఎస్ వర్గాలు అయితే కేసీఆర్ సభకు హాజరౌతారనీ, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతారనీ ఆశాభావంతో ఉన్నాయి. 

అన్నిటికీ మించి ఈనెల 9 నుంచి జ‌రిగే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ఎంతో ముఖ్య‌మైన‌వి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది అయ్యింది. ఈ నేప‌థ్యంలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీని నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్షానికి మంచి అవ‌కాశ‌మ‌ని రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు. రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, పెన్ష‌న్ల తొల‌గింపు, మూసీ ప్ర‌క్షాళ‌న పేరుతో పేదల ఇళ్ల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై రేవంత్ సర్కార్ ను నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి ఇదో మంచి అవకాశంగా బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి పై చేయి సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ సభకు వచ్చి గళం విప్పాల్సి ఉంటుందనీ, ఆయన గైర్హాజరైతే మాత్రం విపక్షంగా బీఆర్ఎస్ వైఫల్యాన్ని అంగీకరించినట్లే అవుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రేవంత్ రెడ్డి డిమాండ్ మేర‌కు, బీఆర్ఎస్ శ్రేణుల విజ్ఞ‌ప్తుల మేర‌కు కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తారా.. లేకుంటే ఈసారికూడా డుమ్మా కొడ‌తారా అనే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.