తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. జమిలి అనుమానాలు!

Publish Date:May 8, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికల విషయంలో ముందస్తు ముచ్చట వెనక్కు పోయి.. జమిలి అవకాశాలపై చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. పొరుగున ఉన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కర్నాటక ఫలితాల ప్రభావం పడి గెలుపు వాకిట బోల్తా పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతోంది.

 దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతో  పాటు వచ్చే ఏడాది లో నిర్వహించాలని భావిస్తోంది. అందు కోసం చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. జమిలి కోసం పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకువచ్చైనా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వరకూ వాయిదా వేయడమే మంచిదన్న భావన బీజేపీ అధిష్ఠానంలో బలంగా వ్యక్తమౌతోందని కేంద్రంలో బీజేపీకి సన్నిహితంగా మెలిగా వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి.

దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగేదెప్పుడన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిగితే..  అది కచ్చితంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది.  ఒక వేళ అదే జరిగితే న్యాయపోరాటానికి రెడీ అవుతామంటోది.  ఒక్క తెలంగాణలోనే కాదు ఈ ఏడాది డిసెంబర్, నవంబర్ లో ఛత్తీస్ గఢ్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది అందరూ భావిస్తున్నారు.  

 అందుకే పలు దశల్లో ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల కమిషన్..  షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో  నవంబరు చివర్లో  ఎన్నికలు నిర్వహించే అవకాశాలే మెండుగా ఉన్నాయని, కనుక అక్టోబరులోనే షెడ్యూలు విడుదల కావచ్చనీ బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ నెలాఖరునాటికి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తరువాత ఆరు నెలల లోగానే .. సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి జమిలిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  ఈ విషయంలో రాజ్యాంగ పరమైన చిక్కులు ఎదురు కాకుండా  ఆర్డినెన్సు రూపంలో  వీటి అసెంబ్లీ కాలపరిమితిని మే నెల వరకూ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.

అయితే బీఆర్ఎస్ మాత్రం యిందుకు ససేమిరా అంగీకరించే అవకాశాలు లేవు.  ఒక వేళ  కేంద్రం జమిలి కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎదుర్కొనడం ఎలా అననదానిపై యిప్పటికే బీఆర్ఎస్ కసరత్తులు మొదలు పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో యిప్పటికే రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉందని చెబుతున్నారు.   

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.