తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన కేసిఆర్
Publish Date:Dec 28, 2012
Advertisement
ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. పెద్దగా సంచలన అభిప్రాయలేమీ ఇక్కడ వెలువడలేదు. ముందునుండి అనుకున్నట్లుగానే ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను తెలియచేసాయి. తెలుగు దేశం పార్టీ తరపున మాట్లాడిన కడియం శ్రీహరి 2008 లో కేంద్రానికి ఇచ్చిన లేఖలోని అంశాలకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అన్నారు. అదే పార్టీ నుండి హాజరైన యనమల రామకృష్ణుడు తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియచేసారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సమావేశంలో పాల్గొన్న గాదె వెంకట రెడ్డి తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో, మంత్రి ఆయనను ఆపి అదే పార్టీకి చెందిన సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణాఫై బిల్లు పెడితే, దానికి మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యెక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్ పార్టీ నుండి హాజరైన ప్రతినిధులు షిండే కు చెప్పారు. ఎంఐఎం పార్టీ తరపున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకించారు. ఒక వేళ విభాజించాల్సి వస్తే, రాయల తెలంగాణా ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిపిఐ కేంద్రాన్ని కోరింది. సిపిఎం మాత్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా తన నిర్ణయాన్ని తెలియచేసింది. ఈ సమావేశం ఫలితంతో సంతృప్తి చెందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు రేపు తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/telangana-all-party-24-20077.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





