కాంగ్రెస్ ముక్త భారత్.. బీజేపీ లక్ష్యానికి తెలంగాణ అడ్డు

Publish Date:Jul 22, 2022

Advertisement

కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చెబుతున్న మాట.. చేస్తున్న నినాదం. ఇందు కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు సడలేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ ను బలహీన పరిస్తే.. జాతీయ స్థాయిలో తమకు పోటీ యే ఉండదన్నది బీజేపీ బావన.  

కాంగ్రెస్ మినహాయిస్తే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న  పార్టీ, తమకు పోటీగా నిలిచే పార్టీ మరొకటుందన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయం. అందుకే  కాంగ్రెస్ ను బలహీనపరుస్తే   తమకు తమకు  తిరుగుండదనే భావనలో బిజెపి నాయకత్వం ఉంది. అందుకు ఆ పార్టీ  ఇటీవల పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే తార్కాణం.  కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాషాయదళం వ్యూహరచన చే స్తోంది.

ఆ వ్యూహాలను అమలు చేస్తున్నది.   అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు,  మద్దతుతో  ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాగానీ, ఆ పార్టీని వెంటాడుతూనే ఉందనేది కూడా పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోయేందుకు ప్రాంతీయ పార్టీలు ఆసక్తిని కనబర్చకుండా బిజెపి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తోంది.

ఆ వ్యూహాల అమలులో  ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ ను దాదాపు నామమాత్రావశిష్టానికి తీసుకు వచ్చేసిందని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. అయితే ఈ వ్యూహాలు దక్షిణాదిలో అంతగా ఫలించడం లేదు. అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలను ఎదురొడ్డి నిలిచి రోజు రోజుకూ బలోపేతమౌతోందన్నది ఆ పార్టీ శ్రేణులే చెబుతున్న మాట. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ బలహీన పడినా లేదా పడినట్లు కనిపిస్తున్నా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో బీజేపీ ఆ అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతోనే బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

 ఇప్పటికే కర్ణాటకలో తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేసింది.  అనంతరం పశ్చిమ ప్రాంతాన     తమిళనాడులో బలోపేతానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. బీజీపీ లక్ష్యమైన కాంగ్రెస్ కు అక్కడ ఏ మంత పట్టు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు కేరళలో కూడా బీజేపీ పట్టు సాధించలేకపోయినా.. అక్కడ కాంగ్రెస్ ఏ మంత బలంగా లేదు. అందుకని ఆ రాష్ట్రం కూడా బీజేపీకి పెద్ద ప్రాధాన్యత రాష్ట్రంగా అనుకోవడం లేదు. ఇక మిగిలినవి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ. ఏపీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. అయినా అక్కడ జనసేనానితో మైత్రి ద్వారా కొద్దో గొప్పో బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.

అయినా ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు కనుక బీజేపీ అక్కడ ఇప్పటికిప్పుడు బలోపేతం కాలేకపోయినా ఫరవాలేదన్న భావనతలో ఉందని అంటున్నారు. ఇక మిగిలింది తెలంగాణ. ఈ రాష్ట్రం విషయంలోనే బీజేపీ ఒకింత ఆందోళనతో ఉంది. అక్కడ పార్టీ బలోపేతమైదన్న సూచనలు ఉన్నా తాజా సర్వేల ప్రకారం అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు దీటుగా, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందన్న విషయం వెల్లడైంది. ఇదే బీజేపీని ఆందోళనకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి తెలంగాణ అడ్డుగా నిలుస్తుందన్న భావనతతో ఉన్న కమల నాథులు అందుకే తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.