తెలంగాణ ఏర్పాటుకు అత్యధిక ప్రాదాన్యత
Publish Date:Oct 1, 2013
Advertisement
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్ర మాత్రం విభజన దిశగానే అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ప్రదాని మన్మోహన్ సింగ్ మరోసారి రాష్ట్రవిభజన తమ తొలి ఎజెండా అని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన ముగించుకుని దీనితో పాటు దోషులుగా రుజువన వారు చట్టసభల్లో ప్రవేశించవచ్చు అంటూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్ ఏ పరిస్ధితుల్లో ఆ వ్యాఖ్యలు చేశారో అడిగి తెలుసుకుంటామన్నారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న ప్రధాని, రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మన్మోహన్ ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీ వెళ్లగానే హోం మంత్రి సుశీల్‌కుమార్ తో సమావేశమై, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ మనసులో తెలంగాణ ఏర్పాటు అత్యదిక ప్రదాన్యత కలిగిన అంశం అని ఆయన పిటిఐ తో తెలిపారు.
http://www.teluguone.com/news/content/telangana-39-26289.html





