ఒక్కరూ లేక ఇద్దరు చాలు
Publish Date:Dec 10, 2012
Advertisement
ఒకవైపు తెలంగాణా కోసం వేసిన అఖిలపక్ష సమావేశం అంతా ఒట్టి భూటకమని ఒకవైపు కాంగ్రేసుని దుయ్యబడుతూనే, మరో వైపు అఖిలపక్ష సమావేశంలో పార్టీల బండారాలు బయట పడతాయని తే.రా.స. నేతలు మరియు టీజేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు బల్లగుద్ది మరీ చెపుతున్నారు. అయితే, ఇప్పుడు అంతటా నంబర్ గేమ్ (ఉదా:యఫ్.డి.ఐ.)నడుస్తోంది కాబట్టి, అఖిలానికికూడా అదేరూల్ వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. అదే పనిలో నేడు తెలంగాణా యంపీలు డిల్లీలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేను కలిసి, ముఖ్యమంత్రి, పీ.సి.సి అధ్యక్షుడు కోరినట్లు అఖిలపక్ష సమావేశం వాయిదావేయవద్దని, ముఖ్యంగా పార్టీకి ఒక్కరినే చొప్పున ఆహ్వానించాలని కోరేరు. అప్పుడే, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణాపై తమ ఖచ్చితమయిన అభిప్రాయం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని నొక్కి మరీ జెప్పారు. గానీ, ఇటువైపు లగడపాటివంటివారి వాదన మరోలా ఉంది. కేవలం, ఒక వర్గంవారి వాదననే వినేసి ఎదో ఒక నిర్ణయం తీసేసుకొంటే కుదరదుగాక కుదరదు, కనీసం పార్టీకి ఇద్దర్నినయిన ఆహ్వానించాలని అప్పుడే అందరి అభిప్రాయాలూ వ్యక్తం అవుతాయని చెప్పుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, ఇప్పుడు గేమ్ అంతా కాంగ్రేసు ప్రకటించబోయే ఆ ‘మాజిక్ నంబరు’ మీదే ఆదారపడి ఉంది. అది, ‘ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు’ అని అంటుందా లేక ఒక్కరు లేక ఇద్దరు ముద్దు అని అంటుందా అనేది తెలిసిపోతే అప్పుడు రాష్ట్రంలో అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు బంతి కాంగ్రేసు కోర్టులో ఉంది. సర్వ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ సర్వ్ చేయకపోతే, అది డిసెంబర్ 2009లో చేసిన ప్రకటనల్లా తయారవుంది పరిస్తితి.
http://www.teluguone.com/news/content/telangana-24-19639.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





