తెలంగాణ వాదమే పనిచేసింది
Publish Date:Mar 21, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మరోసారి తెలంగాణ వాదానికి పట్టం కట్టారని టిడిపి నేత కడయం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో తెలంగాణ వాదమే ప్రధానంగా పనిచేసిందన్న ఆయన ప్రజల తీర్పును శిరసావహిస్తాన్నారు. రాబోయో రోజుల్లో తెలంగాణకు కట్టుబడి ఉంటానని స్పష్టం కడియం చేశారు. తెలంగాణ కోసం ప్రజలు చేసే పోరాటంలో తాను భాగస్వామినవుతాన్న ఆయన తెలంగాణ వాదిగా పనిచేస్తానన్నారు. కాగా కడియంపై టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య ఆదినుంచి మెజార్టీతో కొనసాగారు.
కామారెడ్డిలో సాధించిన ఘన విజయం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారికి అంకితం ఇస్తున్నట్లు టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 44 వేల 465 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గోవర్థన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. కాగా కామారెడ్డిలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబడి డిపాజిట్ దక్కించుకుంది. మూడోస్థానంలో నిలిచిన టీడీపీ డిపాజిట్ కోల్పోయింది.
మహబూబ్ నగర్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జాతీయ పార్టీగా ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. తెలంగాణాను తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంటాం. ప్రజలు ఏ విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో ఆ విశ్వాసాన్ని నిజం చేయడానికి ముందుకుపోతామని భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మా పార్టీని విజయపథంలో నడిపిందని ఆయన అన్నారు. తెలంగాణాను సాధించడంలో ఈ విజయం మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ దిశానిర్దేశానికి ఈ విజయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-24-12819.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





