రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణది నాలుగో స్థానం!

Publish Date:Sep 1, 2022

Advertisement

దేశానికే తెలంగాణ మోడల్ అని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ఫైర్ అయ్యారు. ఆయన చెబుతున్న మాటలన్నీ డొల్ల అని గణాంకాలతో సహా వివరిస్తూ గాలి తీసేశారు.ఆర్థిక అరాచకత్వానికి తెలంగాణ సర్కార్ నమూనాగా నిలిచిందంటూ విమర్శలు గుప్పించారు. ఘనంగా వాగ్దానం చేసిన రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదనీ, రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ అప్పుల కుప్పలా మారిందన్నది వాస్తవమన్న నిర్మలా సీతారామన్.. రాష్ట్రాల అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందన్నారు.

 ఇక తెలంగాణలో కోటి ఎకరాలను సాగులోకి తీసుకువస్తామంటూ ఘనంగా చెప్పుకున్న కేసీఆర్  అందు కోసం ప్రాజెక్టులు నిర్మాణం అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నారనీ, వాస్తవంలో ఆయన చేసంది ప్రాజెక్టుల వ్యయాన్ని   ఇష్టం వచ్చినట్లుగా పెంచడమేనని దుయ్యబట్టారు.   కామారెడ్డిలో   జరిగిన ఒక సభలో గురువారం పాల్గొన్న ఆమె తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.   కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారని విమర్శించారు.

భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కాళేశ్వరం పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం .38,500 కోట్ల రూపాయలైతే కేసీఆర్ సర్కార్ దానిని లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలకు పెంచిందని నిర్మలాసీతారామన్ వివరించారు.  ఎఫ్ఆర్‌బీఎమ్ పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందన్న ఆమె, రాష్ట్రంలో పుట్టే ప్రతి శిశువుపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు.

కేంద్రం  పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు కేంద్రం  20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.  అప్పులపై కేంద్రం కోతలు పెడుతోందని కేసీఆర్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్ధమన్నారు. బడ్జెట్లో పెట్టకుండా అప్పులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు? ఇష్టానుసారంగా అప్పులు చేస్తే కేంద్రం అడగకుండా ఎందుకు ఉంటుందన్నారు? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ గొప్పలు చెప్పుకునే ముందు మీ నిర్వాకంపై రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి దేశంలో తిరగాలని నిర్మలా సీతారామన్ అన్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.