చలిపులి పంజా.. తెలంగాణ గజగజ

Publish Date:Dec 16, 2025

Advertisement

తెలంగాణ ను చలిపులి గజగజలాడిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో  జనం చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం (డిసెంబర్ 16) అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి ప్రభావం జనజీవనంపై పడుతోంది. ఉదయం 9 గంటలు దాటినా ఇళ్ల లోంచి బయటకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది.  ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు  శేరిలింగంపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  

 ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే  చల్ల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగ మంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం (డిసెంబర్ 18)  నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదౌతాయని పేర్కొంది. చలి నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి ఘటన సంచలనం రేపింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా ప్రకటించారు.
సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన.. ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఆపిల్ సరికొత్త మ్యాక్ ఓఎస్ 27 గోల్డెన్ గేట్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాకుండా రోజువారీ వాడకంలో యూజర్లకు ఉపయోగపడే టాప్ 5 ఫీచర్లు, డిజైన్ మార్పులు మరియు పెర్ఫార్మెన్స్ రివ్యూ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, GPRA క్వార్టర్ల నిర్మాణం షురూ కానుంది. రాబోయే 72 గంటల్లో CPWD టెండర్లు విడుదల చేయనుండటంతో రాయపూడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పుంజుకుంటోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రాజ్ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు అతడిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ముగిసిన తర్వాత, పోలీసులు అతన్ని తిరిగి కడప జైలుకు రైలేలో తీసుకువస్తుండగా.. గూడూరు రైల్వేస్టేషన్ వద్ద రాజ్ కుమార్ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సరికొత్త రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. విన్నర్, రన్నరప్ జట్లకు దక్కే కోట్ల ప్రైజ్ మనీ వివరాలు మరియు కొత్త టోర్నీ ఫార్మాట్ విశేషాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ మోసాలపై భారత ప్రభుత్వం బ్యాంకులు మరియు యూపీఐ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.
భూమిపై మొట్టమొదటి సంక్లిష్ట కణాల (Eukaryotes) ఆవిర్భావం వెనుక ఉన్న జన్యు రహస్యాలను బార్సిలోనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాల అద్భుత సమ్మేళనంతో జరిగిన ఈ జీవ పరిణామ క్రమం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.