Publish Date:Oct 25, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నిన్న మొన్నటి వరకూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక ప్రచారంలో వెనుకబడిన మహాఘట్ బంధన్ ఇప్పుడు ఆ వ్యవహారం తేలడంతో ప్రచారాన్నిస్పీడప్ చేసింది. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మహాఘట్ బంధన్ కు చావో రేవోగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న అంచనాలతో ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాఘట్ బంధన్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు గెలుపు అంచనాలతో సీట్ల విషయంలో ఒకింత పట్టుదలకు పోయినా.. చివరాఖరకు ఒక అంగీకారానికి వచ్చాయి.
ఈ వ్యవహారం వల్ల ప్రచారంలో కొంత విలువైన సమయాన్ని మహాఘట్ బంధన్ కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి కవర్ చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్.. ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తిగా ఉంది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా.. అదేదో సినిమాలో హీరో వేషం ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ తిరిగినట్లు.. తేజస్వీయాదవ్.. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే సర్కార్ ను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు.
ఇక ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కర్మాగారాలు ఏర్పాటు చేసి... బీహార్‌లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించిన మోడీయే.. ఆయనపై చర్య తీసుకోకుండా ఆయన సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారనీ, కుంభకోణాల సర్కార్ ను మళ్లీ గెలిపించమని కోరుతున్నారనీ ఆరోపిస్తున్నారు. గత ఆర్జేడీ హయాంలో నితీష్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ అప్పుడు నితీష్ పై చేసిన విమర్శలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేజస్వి ఆరోపిస్తున్నారు. తాను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పననీ, చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా అని నొక్కి చెబుతున్నారు. ఇండియా కూటమి (మహాఘట్ బంధన్)ని గెలిపిస్తే.. తాను సీఎం అవుతాననీ, బీహార్ ను నేరరహిత రాష్ట్రం చేస్తాననీ చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందిస్తాననీ, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tejeswi-yadav-campaign-in-bihar-attract-people-25-208442.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.