Publish Date:May 25, 2025
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి, కటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని లాలూ యాదవ్ ట్వీట్టర్ వేదికగా ద్వారా పేర్కొన్నారు.
తాను 12 ఏళ్లుగా అనుష్క యాదవ్ అనే మహిళతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో శనివారం చేసిన పోస్టు వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజే లాలూ యాదవ్ అతడిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తన ఫేస్‌బుక్ పోస్టుపై ఆదివారం ఉదయమే తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ఆ పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్‌బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టుతో జత చేసిన ఫొటో కూడా ఒరిజినల్ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఎడిట్ చేశారని ఆరోపించారు. తమ ఫ్యామిలీ పరువు తీయడానికే ఎవరో ఇలా చేశారని విమర్శించారు. అయినా ఆ పోస్టును కారణంగా అతడి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్.. తేజ్ ప్రతాప్‌పై పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tej-pratap-yadav-25-198668.html
లోకేష్ ప్రాధాన్యత ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రోజురోజుకూ పెరిగుతున్నది. ఇక ఇప్పుడు కేంద్రంలో లోకేష్ చక్రం తిప్పడానికి స్వయంగా చంద్రబాబే ఆమోదం తెలిపేశారు.
తెలంగాణ బీజేపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై 8న విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.
జపాన్ దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేశారు.
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అంత భారీ మెజారిటీతో గెలిచారంటే అందుకుర ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ చేసిన త్యాగం ఒక ప్రధాన కారణం.
భారత్ -ఏ జట్టు కెప్టన్‌గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది.
మాజీ మంత్రి హరీశ్ రావు లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.
కూటమి ప్రభుత్వం శుక్రవారంసెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో పని చేసినట్టు విన్నానని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అంతా హరీష్ రావుదేనంటూ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై ఇంత కాలం మౌనం వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందా? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది సిట్ గుర్తించిందా? అంటే సిట్ దూకుడు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.