టెడ్డీ డే.. టెడ్డీ బేర్ రంగును బట్టి అర్థాలు ఉన్నాయి తెలుసా?

Publish Date:Feb 10, 2025

Advertisement


 

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న టెడ్డీ డే జరుపుకుంటారు. టెడ్డీ బేర్ కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక అందమైన మార్గం కూడా. ప్రతి టెడ్డి బేర్ రంగు వేర్వేరు భావోద్వేగాలను సూచిస్తుంది. ఎవరైనా  టెడ్డీని బహుమతిగా ఇస్తే, దాని రంగును బట్టి వారి మనసులో ఏముందో  అర్థం చేసుకోవచ్చు. టెడ్డీ బేర్ ను కేవలం ప్రేమికురాలికి, లేదా ప్రియుడికి మాత్రమే కాదు.. ఎవరికి అయినా ఇవ్వవచ్చు. అయితే అది ఎవరికి ఏ రంగు ఇవ్వాలనే విషయం తెలుసుకుని ఇస్తే ఎంతో మంచిది.  ఏ రంగు టెడ్డీ బేర్ ఏ విషయాన్ని తెలుపుతుందంటే..

ఎరుపు రంగు టెడ్డీ బేర్..

ఎరుపు టెడ్డీ బేర్  ఐ లవ్ యు అనే మాటను వ్యక్తం చేయడానికి ఇస్తారట. మాటలు లేకుండా  ప్రేమను వ్యక్తపరచడానికి ఎరుపు రంగు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఎవరైనా  ఎర్రటి టెడ్డీ బేర్ ఇస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం. సంబంధాన్ని బలోపేతం చేయడానికి,  ప్రేమను వ్యక్తపరచడానికి ఎర్రటి టెడ్డీ బేర్‌ను ఇస్తారు.

పసుపు టెడ్డీ బేర్..

పసుపు గులాబీల మాదిరిగానే, పసుపు టెడ్డీ బేర్లు కూడా స్నేహాన్ని,  కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. పసుపు రంగు ఆనందం, స్నేహం,  సానుకూలతను సూచిస్తుంది. ఎవరైనా  పసుపు రంగు టెడ్డీని ఇస్తే, వారు మిమ్మల్ని మంచి స్నేహితుడిగా భావిస్తారని అర్థం. ఇది కొత్త సంబంధాన్ని ప్రారంభించే సంకేతం కూడా కావచ్చు. ఒక వేళ టెడ్డీ డే రోజు పసుపు రంగు టెడ్డీని ఎవరైనా ఇస్తే వారు ప్రేమిస్తున్నారనే అపోహలో పడకండి.

బ్రౌన్ టెడ్డీ బేర్..

బ్రౌన్ రంగు టెడ్డీ బేర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది సంరక్షణకు,  బలానికి చిహ్నం.  ఎవరికైనా బ్రౌన్ టెడ్డీ బొమ్మను ఇస్తే, సంబంధం బలంగా,  నమ్మదగినదిగా ఉందని చూపిస్తుంది. ఎవరికైనా మద్దతుగా ఉండాలన్నా, వారికి  బలం కలిగించాలనుకున్నప్పుడు, ఇలాంటి టెడ్డీని బహుమతిగా ఇవ్వవచ్చు.

నీలం రంగు టెడ్డీ బేర్..

నీలం రంగు నిజమైన ప్రేమ,  నమ్మకాన్ని సూచిస్తుంది. ఎవరైనా  నీలిరంగు టెడ్డీని బహుమతిగా ఇస్తే, వారు మిమ్మల్ని తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారని అర్థం. ఇది  సంబంధంలో నమ్మకాన్ని,   నిజాయితీ సూచిస్తుంది.  ఎవరికైనా ఎల్లప్పుడూ అండగా ఉంటారని చూపించాలనుకున్నప్పుడు, నీలిరంగు టెడ్డీ బేర్ ఇవ్వవచ్చు.

పింక్ టెడ్డీ బేర్..

పింక్ టెడ్డీ  ఎవరైనా ఇస్తే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని.  మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నారని అర్థం. ఇది ఇష్టాన్ని,  ప్రేమ భావాలను సూచిస్తుంది. ఎవరైనా మీకు పింక్ టెడ్డీని ఇస్తే, వారు మీతో ఉన్న సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని అర్థం. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా అనిపించాలని, వారు మీకు ఇష్టమని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ రంగు టెడ్డీ బేర్‌ను వారికి ఇవ్వవచ్చు.


                                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.