సైన్స్ రంగంలో మహిళల విజయ పతాకం..  

Publish Date:Feb 11, 2025

Advertisement

 

 

ఆడవారు చదువుకి కూడా నోచుకోని ఆటవిక కాలం నుంచి మగవారితో సమానంగా ఉన్నతవిద్య పొందే కాలానికి వచ్చింది మన సమాజం. అయితే ఇప్పుడు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ఉంటున్నప్పటికీ ఇంకా వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అందుకే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM)  రంగాల్లో మహిళలు, అమ్మాయిలు సాధించిన విజయాలని,  వారి కృషిని గౌరవించటానికి,  శాస్త్ర-సాంకేతిక రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారతకున్న  ప్రాముఖ్యతను గుర్తుచేయటానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి11న ‘అంతర్జాతీయ మహిళలు, బాలికల  విజ్ఞానశాస్త్ర దినోత్సవం’ జరుపుకుంటారు.   శాస్త్రీయ రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి ఎదురైన అడ్డంకులను, దురభిప్రాయాలను తొలగించడమే ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.  మరి ఈ దినోత్సవం మహిళా పురోగతికి ఎలా సాయపడుతుందో తెలుసుకుంటే...  

ఎప్పుడు మొదలైందంటే..


మొదటి నుంచీ  సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM) వంటి రంగాలలో లింగ అసమానత్వం చాలా ఎక్కువగా ఉంటూ వస్తుంది. అయితే మహిళల సాధికారత, లింగ సమానత్వం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని  ఐక్యరాజ్యసమితి భావించింది. 2015లో జనరల్ అసెంబ్లీ ద్వారా అంతర్జాతీయ మహిళలు, బాలికల విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్థాపించింది.  ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. మహిళా శాస్త్రవేత్తలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిన  ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త ఐన మేరీ క్యూరీ  జన్మదినాన్ని గౌరవిస్తూ ఈ రోజుని ఎంచుకున్నారు. ఈ దినోత్సవం గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచ సమాజంలోని మహిళలు, బాలికలను విజ్ఞానశాస్త్రంలో భాగస్వాములని  చేసేందుకు ప్రేరేపించింది.
 
 సైన్సు రంగంలో మహిళా పురోగతి ..

2700బి‌సి కాలానికి చెందిన   మెరిట్-ప్తా సమాధిపై  “చీఫ్ ఫిజీషియన్” అని రాసి ఉండటంతో ఆవిడే మొదటి మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచింది. 1876లో ఎలిజబెత్ బ్రగ్ అనే మహిళ తొలి ఇంజనీరింగ్ పట్టా పొందటంతో మహిళల ఉన్నత విద్యకి తొలి అడుగు పడినట్టయింది. మన ఇండియాలో అయితే 1919లో అయ్యల సోమయాజుల లలిత మొట్టమొదటి మహిళా ఇంజినీరుగా పట్టా పొందారు.  రేడియోధార్మికత మీద విశేష ప్రయోగాలు చేసిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1903లో మొట్ట మొదటి మహిళా నోబెల్ గ్రహీతగా నిలిచారు. 1970ల నాటికి ఇంజనీరింగ్  డిగ్రీలు పొందుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. 1980ల నాటికి యూనివర్సిటీల్లో సుమారు 37శాతం మహిళలు కంప్యూటర్ సైన్సుని ప్రధానంగా ఎంచుకున్నారు. మన భారతదేశానికి చెందిన  ప్రతిభావంతులయిన   మహిళలు చాలా మంది సైన్సురంగంలో దేశపురోగతికి ఎంతగానో దోహదం చేశారు. బ్రిటీష్ కాలం నుంచి నేటివరకూ ఎంతోమంది భారత మహిళలు తమకున్న అడ్డంకులన్నీ దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య చదవటంతో పాటూ, మన దేశ పురోగతిలో సాయపడ్డారు. నేడు మన దేశం గర్వంగా చెప్పుకునే ఇస్రో సంస్థలో కూడా మహిళల  ప్రాతినిధ్యం బాగా పెరిగింది. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక భాద్యతలు చేపట్టారు. డి‌ఆర్‌డి‌ఓ లో కూడా వీరి కృషి అమోఘం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టరుగా పనిచేసిన టెస్సి థామస్ ‘మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా”గా పేరు పొందారు. ఇలా ఎంతోమంది మహిళలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు.  

విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితశాస్త్రం(STEM) రంగాల్లో లింగ భేదం లేకుండా  పురుషులతో పాటూ మహిళలు, బాలికలు కూడా  శాస్త్రీయ విద్య-వృత్తుల్లో సమాన అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా శాస్త్రవేత్తల విజయాలను, పరిశోధనలో  సాంకేతిక పురోగతికి వారు చేసిన కృషిని గుర్తించి చాటి చెప్పటం కూడా దీని ముఖ్య ఉద్దేశమే.  ఆయా రంగాల్లో విశేషంగా రాణించిన మహిళల విజయాలకి గుర్తింపు, గౌరవమివ్వటం ద్వారా మరెంతో మంది ఈ రంగాల వైపు వెళ్లడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునేలా, నాయకత్వం వహించేలా  మహిళలని మరింతగా ప్రోత్సహించడం,  యువతకు స్ఫూర్తిని అందిస్తూ, STEM రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించేలా చేయడం వంటివి కూడా ఈ దినోత్సవ లక్ష్యాల్లో ఉన్నాయి.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో..
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది...
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక...
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది...
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి...
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.