టెక్నాలజీ ఎఫెక్ట్.. తిరుమలలో గంటకు పది వేల మందికి శ్రీవారి దర్శనం

Publish Date:May 14, 2026

Advertisement

కలియుగ  ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. వారాంతం, పర్వదినాలలో వీరి సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. శ్రీవారి దర్శన భాగ్యం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండటం కద్దు. అలాగే  కొండపై వసతి గదుల లభ్యత లేక కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే వారు.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీని ఆశ్రయించి భక్దులకు సులభంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంది.  టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన   చర్యల వల్ల ఇప్పడు భకులకు మరీ జాగు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. భక్తులకు జాగు లేకుండా స్వామివారి దర్శనం లభిస్తుండటంతో  కొండపై వసతి లభ్యత కూడా పెరిగింది.  ఇందుకు ప్రధాన కారణంగా తిరుమల తిరుపతి దేవస్ధానం   అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్  వ్యవస్థ కారణం. 

ఈ నెలలో ఒకే రోజు తిరుమల శ్రీవారిని  91 వేల మంది భక్తులకు 12 గంటలలో దర్శించుకోగలిగారు. గతంలో అయితే ఈ సంఖ్యలో భక్తుల దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టేది. ఇక తాజాగా బుధవారం (మే 13) శ్రీవారిని 80 వేల మంది దర్శించుకున్నారు. వీరందరికీ కేవలం 8 గంటలలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది.  అంటే గంట వ్యవధిలో పది వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారన్న మాట.  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్  వ్యవస్థ ద్వారా స్వల్ప వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుండటంతో.. కొండపై విడిది గదుల కొరత సమస్యే ఉత్పన్నం కావడం లేదని టీటీడీ చెబుతోంది.

ఎందుకంటే దర్శనం చేసుకున్న భక్తులు వెంటనే కాటేజీలు, విడిది గదులను వెకేట్ చేస్తున్నారు. దీంతో విడిది సమస్య లేకుండా పోయిందంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ దాదాపుగా వసతి లభిస్తున్న పరిస్థితి. గతంలో అయితే శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడిన దాని కంటే ఎక్కవ సేపు వసతి గదుల కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయని భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

By
en-us Political News

  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అసెంబ్లీకి ముఖం చాటేయడం దగ్గర నుంచి, వైసీపీ అధినేత జగన్ చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వరకూ వైసీపీ చర్యలన్నీప్రజలకు దూరం జరిగేలాగే ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధి నిర్వహణకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు తీవ్ర ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ.. మొత్తం 3.38 కోట్లు..!
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు పార్లమెంట్ ఆమోదం..!
నటి త్రిషపై అన్నాడీఎంకే నేత ఘాటు వ్యాఖ్యలు..!
పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
అత్యాచార ఆరోపణలపై యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు.
ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు.
విఐపి మొబైల్ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్ అంటే ఏమిటి? 9999, 0000, 786, 1234 వంటి నంబర్లను ఆన్‌లైన్‌లో ఎలా ఎంచుకోవాలి, ధర వివరాలు మరియు భద్రతా జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..!
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.