LATEST NEWS
  ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..! తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం. బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్‌ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.   Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal  
రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ మూలైనా సరే ఏదైనా ఒక ఘోరం జరిగితే, ఒక నేరం జరిగితే.. వాటి మూలాలు ఏపీలోని వైసీపీ పార్టీలో ఉంటాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నవే. ఇప్పుడు తాజాగా నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి.  కాకినాడ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన  కుటుంబ  ఆత్మహత్య ఉదంతం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు  పాల్పడటం వెనుక లవ్ జిహాద్, మతమార్పిడి ఒత్తిళ్లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్  ఉన్నాయన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ కుటుంబం ఆత్మహత్యకు  కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ అనే వ్యక్తికి  వైసీపీతో సంబంధాలున్నాయన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ  నాయకుడు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే   ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సాధిక్ అనుచరుడన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  సాధిక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు  నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  సాధిక్,  వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.   సాధిక్ మాజీ ఎమ్మెల్యే   అనుచరుడేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  వైసీపీ హయాంలో సాధిక్ కు  రాజకీయ అండదండలు పుష్కలంగా లభించాయని, ఆ అండదండలతోనే సాధిక్   ఇటువంటి అరాచకాలకు ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  భాధిత  నూకరాజు కుటుంబాన్ని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడంతో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.  గతంలో సాధిక్ ప్రారంభించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్  ప్రారంభోత్సవానికి కూడా మాజీ ఎమ్మెల్యే హాజరైనట్లు చెబుతున్నారు.  దీనిపై కాకినాడ ఎంపీ, జనసేన నాయకుడు   తంగెళ్ల శ్రీనివాస్ నూకరాజు కుటుంబానికి   న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను   ఈ ఉదంతం వెనుక ఏకపక్ష వేధింపులే కాకుండా ఒక పెద్ద వ్యవస్థాగత రాకెట్ పనిచేస్తోందని ఎంపీ ఆరోపించారు. అమాయక కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.   Kakinada Family Suicide, Sadiq Controversy, Dwarampudi Chandrasekhar Reddy Link , Kakinada Love Jihad Case
  తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. ఇటీవల తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆమె కేవలం 'ప్లాన్-ఎ' ప్రకారమే మాట్లాడిందని, అసలు ఆమె మనసులో ఉన్న 'ప్లాన్-బి' ఏంటో తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాలపై మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. మంగళవారం జరిగిన వనమహోత్సవంతో పాటు బుధవారం నిర్వహించిన ఇతర అధికారిక సమావేశాల్లోనూ సురేఖ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఉన్న అంశాలపై తాను స్పందించబోనని మురళి తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం వెలువరించేంత వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగానే ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ వైఖరిపై పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ముందుకు కూడా ఈ అంశం వెళ్లడంతో అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ భేటీలు, సీనియర్ నేతల సంప్రదింపుల నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపించాయి. అధిష్టానం నిర్ణయం ఆధారంగా తదుపరి రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. Konda Murali, Konda Surekha, Telangana Congress News, Deputy cm Bhatti Vikramarka,TeluguOne News, CM Revanth reddy, Congress party, Minister Uttam Kumar Reddy,  MLA Komatireddy Rajagopal Reddy  
ఏపీలో   స్థానిక  ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ అధినేత   జగన్  అడ్డా అయిన   పులివెందుల మున్సిపాలిటీని  తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది. అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.  గతంలో  వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ   యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది.  అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు.  గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు..  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో  సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.    AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne
  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది.  కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.  ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.  కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా?  ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics  
ALSO ON TELUGUONE N E W S
  మాస్ మహారాజా రవితేజ, మైత్రి మూవీ మేకర్స్, శివ నిర్వాణ ఏ ముహూర్తాన ఇరుముడిని స్టార్ట్ చేసారో గాని, వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు తమ పనులన్నీ పక్కన పెట్టి ఇరుముడికి క్యూ కడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు కూడా ఇంత పెద్ద సంఖ్యలో జనం బయటకు రావడం చూడలేదేమో అనే రీతిలో ఏ, బి, సి సెంటర్లు అనే తేడా లేకుండా తాండోపతండాలుగా తరలివెళ్తున్నారు. దీంతో  బాక్సాఫీస్ చరిత్రలోనే ఇదొక అరుదైన దృశ్యంగా నిలుస్తోంది.   సార్వత్రిక ఎన్నికల రోజున  కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపించడం గమనిస్తూనే ఉంటాం. కానీ 'ఇరుముడి' సినిమా ప్రదర్శితమవుతున్న మల్టీప్లెక్స్‌ల నుండి మొదలుకొని పల్లెటూళ్లలోని సింగిల్ స్క్రీన్స్ వరకు అన్ని థియేటర్ల ముందు జనాలు నిండిపోయి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఎవర్ గ్రీన్ ఆణిముత్యం లవకుశ తో కూడా ఇరుముడిని పోలుస్తున్నారంటే ప్రేక్షకుల ప్రేమ సునామీని అర్ధం చేసుకోవచ్చు. చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీస్ తో నైట్ సెకండ్ షోస్ హౌస్ ఫుల్స్ తో కలకాలాడుతూ ఉండటం ఇరుముడి రూపంలో తెలుగు సినిమా అందుకున్న గౌరవం.  Also Read: నారాయణ కోసం భావోద్వేగంతో మహాప్రస్థానానికి చిరంజీవి.. పది రోజుల క్రితమే కలిస్తే  ముఖ్యంగా సినిమా పని మామూలుగానే అయిపోయింది, పైగా ఓటిటి రాకతో మరింత దారుణంగా తయారయ్యిందనుకునే వాళ్లకయితే ఇరుముడి విజయం మూర్ఛవచ్చినంత పని చేసింది. ఆ తర్వాత సినిమాని తక్కువ చేసినందుకు చెంపలేసుకుంటున్నారు. ఇరుముడి 150 కోట్ల క్లబ్ లోకి  అతి త్వరలోనే చేరబోతుంది. Irumudi, Raviteja,TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood
  ప్రముఖ హీరో, నటుడు, నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడు జీవీ నారాయణ రావు గారు బుధవారం సాయంత్రం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం ప్రాంగణంలో నారాయణగారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు '1977 నుంచి నారాయణరావు నాకు పరిచయం. నేను, నారాయణ, రాజేంద్రప్రసాద్, హరిప్రసాద్ చెన్నై లో ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం.    తను మాకు సీనియర్, సినిమా గురించి చాలా విషయాలు చెప్తూ సరదాగా ఉండే వాడు. నేను నిలదొక్కుకున్నాకా  నిర్మాతగా నాకు చెయ్యాలని అడిగితే వెంటనే చేశాను. అలా ఒక మూడు సినిమాల దాకా నారాయణకి చేశాను. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటుడుగా  అవకాశాలు ఇప్పించాను.  ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేది నిజం. పదిరోజుల క్రితం కలిసి మనవూరి పాండవులు కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ప్రమోట్ చేయాలంటే సరే అన్నాను. గంట సేపు మాట్లాడుకున్నాకా నాతో ఫోటో కూడా దిగాలని అంటే దిగాను. ఆరోగ్యం జాగ్రత్త అంటే  మనకేం కాదు అన్నాడు.  కొంచం మొండి మనిషి. వెళ్తున్నప్పుడు  ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. కానీ అదే గుడ్ బై అవుతుందని అనుకోలేదు. నారాయణ కుటుంబం నా కుటుంబం. ఎక్కడ ఉన్నా అయన ఆత్మకి శాంతిచేకూరాలని కోరుకుంటున్నానని భావోద్వేగంతో చెప్పాడు. నారాయణ రావు వయసు 73  సంవత్సరాలు కాగా పూర్తి పేరు గుళ్ళపల్లి వెంకట నారాయరావు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి స్వగ్రామం. Chiraneevi, GV narayanarao, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood
  బండి సరోజ్ కుమార్.. సరికొత్త నటనకి కేర్ ఆఫ్ అడ్రస్.. మంచి అవకాశాలు వస్తే తెలుగు సినిమాపై తనదైన ముద్రవేయడం గ్యారంటీ. కానీ హిట్ సినిమా పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే వ్యాఖ్యలు,  పోస్టులు వైరల్ గా మారడం ఆనవాయితీగా మారింది.  తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా  ఆయన చేసిన ఒక సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.  సినీ రంగంలో ప్రతిభ లేని వ్యక్తులే కమిట్‌మెంట్లు, ఎఫైర్లు లాంటి  అడ్డదారులని  ఎంచుకుంటారు. అవకాశాల పేరుతో జరిగే ఈ వ్యవహారాల వెనుక ఉన్న అసలు కోణాన్ని ఎవరూ చూడటం లేదు. మగవాళ్లతో ఆడవాళ్లు సమానం అని బిగ్గరగా వాదించే ఫెమినిస్టులు, అవకాశాలు ఇస్తామంటే పడుకున్నాం, మమ్మల్ని దారుణంగా వాడుకున్నారని చెప్పే మాటలను అసలు ఎలా సమర్థిస్తారు?" ."నువ్వే నీ బ్రతుకుదెరువు కోసం అవతలివాడిని వాడుకున్నావ్ అనే కోణంలో ఈ ఫెమినిస్టులు ఎందుకు ఆలోచించరు?. ఇండస్ట్రీలోకి వచ్చే ఎక్కువమంది మగవారిలో అమ్మాయిల కోసం వచ్చే చిల్లరగాళ్లే ఉంటారు. అదే సమయంలో అమ్మాయిలలో కూడా అలాంటి వాళ్లే ఉంటారు  . వీళ్లంతా సమాజానికి పరాన్నజీవులు (పారాసైట్స్) , సొంతంగా ఏ రకమైన కళాత్మక ప్రతిభా లేనివాళ్లు మాత్రమే ఇలాంటి ఎఫైర్లు, కమిట్‌మెంట్లకు పాల్పడతారు. నిజమైన ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఇలాంటి నీచమైన పనులకి పాల్పడతారు. ఇలాంటి వ్యక్తులు చేసే సినిమాలు థియేటర్లకు వచ్చినట్టు కానీ, పోయినట్టు కానీ ఎవరికీ తెలియ దు. ఇండస్ట్రీలో కొందరు పగ, ప్రతీకారంతోనే వ్యక్తిగత కేసులు పెడుతూ, పబ్లిసిటీ కోసం ఎదుటివారి ప్రతిష్టని నాశనం చేసి, కుటుంబాలని రోడ్డుపైకి ఈడుస్తున్నారు. కొత్తగా సక్సెస్ లోకి వచ్చి మెరుస్తున్న వారిని టార్గెట్ చేయడానికి రాబందుల్లా కాచుకుని కూర్చుంటారని  తన ట్వీట్ లో పేర్కొన్నాడు.  Also Read: కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదలపై క్రేజీ అప్‌డేట్! Bandi Saroj Kumar, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom
Rocking Star Yash has once again demonstrated his formidable box-office pull with Toxic, which has exploded at the global box office with a stunning opening. The Geetu Mohandas directorial has crossed the 150 Cr gross mark worldwide on its first day, with every major language contributing to the film’s spectacular performance. From class to mass centres, Toxic mania witnessed with a massive occupancies witnessed in all the centres in different languages. The Hindi version has been particularly dominant, recording 60 Cr+ and becoming the highest Day 1 grosser for Yash, breaching his previous best held by KGF 2. The movie is super strong in Telugu states as well. It has raked in 20 Cr+ gross, making it the biggest opener among Kannada movies released in Telugu. After establishing an enormous following through the KGF franchise, Yash has now carried that momentum into Toxic. Produced by KVN Productions and Monster Mind Creations, the film’s opening-day performance indicates that his star power has evolved into a genuine nationwide theatrical phenomenon, with audiences turning up in significant numbers across India and international markets alike.  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వచ్చిన తాజా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'.  ఆగస్టు 7 న విడుదలవ్వగా  హిట్ టాక్ తో నేటికీ థియేటర్స్ లో తన సత్తా చాటుతూ ఉంది .వినూత్నమైన కాన్సెప్ట్, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు కొరియన్ కల్చర్, హారర్ మరియు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ మలచిన తీరు ఒక రేంజ్ అని చెప్పవచ్చు. ఓటిటి రిలీజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.   థియేటర్ రిలీజ్ అయిన 4 నుంచి 6 వారాల విండో పీరియడ్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కురిందని, వినాయక చవితి పండుగ కానుకగా  సెప్టెంబర్ 10 లేదా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  సెప్టెంబర్ 4నే వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.అయితే  బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుండటంతో సెప్టెంబర్ 11 తేదీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. Also Read: సన్నీలియోన్ కి ముంబై కోర్టు శుభవార్త.. ఫ్యాన్స్ లో జోష్  రాయలసీమకి చెందిన కనకరాజు జీవితంలో కొరియా నుంచి వచ్చిన ఒక వింత వస్తువు మరియు అతీంద్రియ శక్తి ఎలాంటి గందరగోళం సృష్టించాయి అనేది కథాంశం. వరల్డ్ వైడ్‌గా 60 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లని సాధించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నడుస్తున్న కనకరాజుని నెట్‌ఫ్లిక్స్  సుమారు 26 కోట్ల భారీ డీల్‌ కి దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. korean Kanakaraju, Merlapaka Gandhi, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘విశ్వంభర’. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా, VFX వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  2025 సంక్రాంతి టార్గెట్ గా పట్టాలెక్కిన 'విశ్వంభర', పలుసార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ ఏడాది దసరా బరిలో సినిమాను దింపాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఆ రకంగానే ఇండస్ట్రీ వర్గాల్లో దసరా రేసులో ‘విశ్వంభర’ రిలీజ్ కానుందనే టాక్ గట్టిగా నడిచింది. కానీ ఇప్పుడు దసరాకు కూడా రావడం లేదని తెలుస్తోంది. నిజానికి దసరా రేస్ లో టాలీవుడ్ నుంచి ‘విశ్వంభర’ ఒక్కటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.  ‘విశ్వంభర’ విడుదల వాయిదా పడుతోందని, ఈ దసరాకు రావడం లేదని కన్ఫర్మేషన్ వచ్చాకే.. ‘రణబాలి’ మేకర్స్ తమ దసరా రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.       [Chiranjeevi, Vishwambhara, Vijay Deverakonda, Ranabaali]  
నూతన నటీనటులతో, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రం 'సహ - లైఫ్ ఆఫ్ సంజు'. సుమైరా స్టూడియోస్ బ్యానర్ పై తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మాణంలో, నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటోంది. ట్రైలర్ ప్రారంభంలోనే సంజు, సహస్రల మధ్య ఉండే నిష్కల్మషమైన ప్రేమ, తుంటరి పనులు ప్రేక్షకులలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. "సహ నీతో కొంచెం మాట్లాడాలి" అంటూ డైరెక్ట్ గా ముద్దు పెట్టేయడం లాంటి సన్నివేశాలతో.. కాలేజీ రోజుల నాటి మధురమైన జ్ఞాపకాలు, ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన అనురాగంతో ఆహ్లాదకరంగా సాగిపోతుంది. అయితే ఈ సంతోషకరమైన ప్రయాణం ఎక్కువ కాలం నిలవదు. విధి ఆడే విచిత్రమైన ఆటలో వీరి జీవితంలోకి అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేమతో పాటు తీవ్రమైన మానసిక సంఘర్షణ, గతం తాలూకు వేదన మొదలవుతాయి. తను చేసిన ఒక పొరపాటు వల్ల సంజు ఎలాంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు, "నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది కదరా" అంటూ తల్లడిల్లే సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తాయి. గతాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకుంటూ సంజు అనుభవించే వేదన, అతని జీవితంలోకి వచ్చే సవాళ్లు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఒక సాధారణ వ్యక్తి జీవిత ప్రయాణం నేపథ్యంలో.. బాల్యం నుండి నడివయసు వరకు సాగే భావోద్వేగాలను దర్శకుడు నిశాంత్ దోటి ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ కు శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి భావోద్వేగ సన్నివేశంలోనూ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా పేరుగాంచిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా విడుదల చేస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబరు 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ 'సహ' సినిమా, బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.       [Sahaa Life of Sanju, Sahaa Trailer, Shiva Kumar Kasaram, Swetha Lakshman]  
  ఈ ప్రపంచంలో ఎక్స్ పైరీ డేట్ లేని ఆనందం ఏదైనా ఉంది అంటే సినిమా. అందుకే    రీ రిలీజ్ కల్చర్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. దాదాపుగా సినిమా పుట్టిన దగ్గర్నుంచే రీ రిలీజ్ కల్చర్ అనేది. కాకపోతే సోషల్ మీడియా పుట్టుక వల్ల రీ రిలీజ్ ఆనవాళ్లు అభిమానులు, సినీ ప్రపంచానికి దగ్గరగా చేరుతున్నాయి. ఇక  తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భాల్లో లేదా ప్రత్యేక వేడుకల్లో వింటేజ్ క్లాసిక్స్, ఇండస్ట్రీ హిట్లను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ రీ-రిలీజ్‌లు ఫ్యాన్స్‌ లో జోష్ తీసుకురావాల్సింది పోయి తీవ్ర నిరాశని  మిగులుస్తున్నాయి. చివరి నిమిషంలో చిత్రాల విడుదలలు వాయిదా పడటం, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్‌లోని ఆల్-టైమ్ మాస్ ఎంటర్‌టైనర్ 'ముఠామేస్త్రీ' చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద కటౌట్లు కట్టి, బ్యానర్లు వేసి, సంబరాలు చేసుకోవడానికి 100% సిద్ధమయ్యారు. అయితే డిజిటల్ రీమాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌లో 4K క్వాలిటీ లోపాలు మరియు కొన్ని సాంకేతిక సమస్యలు బయటపడటంతో మేకర్స్ ఈ సినిమా రీ-రిలీజ్‌ను చివరి నిమిషంలో తాత్కాలికంగా వాయిదా వేశారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. Also Read: ఇరుముడి నటికి బెదిరింపులు.. రోడ్డుపై కనిపిస్తే కొడతాం  మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్‌లో మ్యాజికల్ లవ్ స్టోరీగా నిలిచిన 'గీతాంజలి' రీ-రిలీజ్ విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. 100% పర్‌ఫెక్ట్ పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ అందించాలనే క్రమంలో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అక్కినేని అభిమానులు కూడా నిరాశ చెందక తప్పలేదు. సాధారణంగా అభిమానులు వందలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి, థియేటర్లని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. . కానీ ఈ వాయిదాల పర్వం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. Mutha Mestri, Geethanjali, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom
ఇటీవల మూవీ ప్రమోషన్స్ లో కొందరు దర్శకులు, నటీనటులు ఇస్తున్న స్టేట్మెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా, నడిరోడ్డు మీద షర్ట్ విప్పి నిల్చుంటా అంటూ ఇలా ఎన్నో ఛాలెంజ్ లు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఒక హీరోయిన్ కూడా చేరిపోయింది. గ్లింప్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'సహా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన చిత్రంపై ఉన్న నమ్మకంతో ఆమె విసిరిన సవాల్ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. "నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ ఎంత మంచి సినిమా తీశారురా వీళ్లు అని కచ్చితంగా అనుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ డిజప్పాయింట్ అవ్వరు. ఒకవేళ ఎవరైనా డిజప్పాయింట్ అయితే అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు గీయించుకుంటా." అన్నారు.  ఈ ఈవెంట్ లో 'సహా' మూవీ హీరో శివకుమార్ సైతం ఇలాంటి కామెంట్స్ చేయడం విశేషం. "సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్న మా సినిమా చూసే ప్రేక్షకులకు నా రిక్వెస్ట్. మీరు అంచనాలు ఏ స్థాయిలో అయినా పెట్టుకొని రండి. ఆ అంచనాలకు ఒక్క శాతం తగ్గినా.. నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి." అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.  మరి 'సహా' మూవీపై హీరోహీరోయిన్లు పెట్టుకున్న ఈ అపారమైన నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.       [Swetha Lakshman, Bold Challenge, Sahaa Life of Sanju, Sahaa Movie]  
  సినిమాకి సంబంధించి  హీరో క్యారక్టర్ ని ప్రేక్షకులు ఎంతలా ప్రేమిస్తారో, నెగిటివ్ రోల్ లో చేసిన వారిని అంతే ఇదిగా ద్వేషిస్తారు.  కానీ ఆ ద్వేషం స్థాయి హద్దులు కూడా దాటుతుంది. దీంతో ఆ క్యారక్టర్ చేసిన వారికి బెదిరింపులు వస్తుంటాయి. అంతలా నెగిటివ్ క్యారక్టర్ లో లీనమయ్యి నటిస్తారు. అలా లీనమయ్యి నటించిన నటి స్వాసిక విజయ్. ఇరుముడిలో ధనలక్ష్మి అనే టీచర్ గా కీలకమైన రోల్ లో కనిపించింది. ఆ  రోల్ లో ఆమె నటన ఏ స్థాయిలో ఉందంటే, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఆమె రోల్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వాసిక విజయ్ మాట్లాడుతు 'సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో తనకు వస్తున్న మెసేజ్‌లు చూసి ఆశ్చర్యపోయానని, నువ్వు సినిమాలో చాలా చెడ్డ పాత్ర చేశావు.. నిన్ను బయట చూస్తే కొట్టాలనిపిస్తోంది" అంటూ నెటిజన్లు మెసేజ్‌లు పెడుతున్నారని, నెగిటివ్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఒక నటిగా ఇవే తనకు లభించిన అతిపెద్ద ప్రశంసలు. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు స్వయంగా నాకే నా క్యారక్టర్ పై కోపం వచ్చింది. సమాజంలో ధనలక్ష్మి అనేది చాలా పవిత్రమైన, మధురమైన పేరు. కానీ  సినిమాలో మాత్రం ఒక చెడ్డ మనస్తత్వం ఉన్న మహిళగా  డిజైన్ చేశారు  సమాజంలో ఉండే కొందరు చెడ్డ టీచర్ల వైఖరిని ప్రతిబింబించేలా దర్శకుడు శివ నిర్వాణ మలిచారని చెప్పుకొచ్చింది. స్వాసిక విజయ్ మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన నటి. Also Read: ప్రముఖ సింగర్ దారుణహత్య Swasika Vijay, Irumudi, Tollywood, eluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఒక నిశ్శబ్ద శత్రువు. మనలో చాలామంది రక్తపోటును నియంత్రించడానికి వైద్యులు సూచించిన బిపి మందులను వాడుతుంటారు. అయితే తరచూ మందులు వేసుకోవడం మరచిపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతటి తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుందో తెలుసా? యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ESC) 2026 కాంగ్రెస్‌లో సమర్పించిన సరికొత్త అంతర్జాతీయ పరిశోధన అధ్యయనం ప్రకారం, బిపి మందులు సరిగ్గా వాడకపోతే గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం నుండి లభించే రక్షణ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ అధ్యయనంలో తేలిన గణాంకాలు నిజంగా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం, వైద్యులు సూచించిన బిపి మందులను కనీసం 80 శాతం కంటే ఎక్కువ రోజులు క్రమం తప్పకుండా వాడే వ్యక్తులలో తీవ్రమైన గుండె జబ్బులు, గుండెపోటు, మైక్రో వాస్కులర్ సమస్యలు, స్ట్రోక్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే మరణాల ప్రమాదం ఏకంగా 11 శాతం వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఈ విధంగా క్రమం తప్పకుండా మందులు ఉపయోగించే రోగులలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ సగటున 5.2 mm/Hg వరకు సమర్థవంతంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనికి విరుద్ధంగా, వారంలో ఒక్క రోజు కంటే ఎక్కువసార్లు బిపి మందులను వేసుకోవడం మరచిపోయే లేదా 80 శాతం కంటే తక్కువగా మందులను పాటించే రోగులలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వారిలో సిస్టోలిక్ రక్తపోటు కేవలం 3.0 mm/Hg మాత్రమే తగ్గుతుంది. అంతేకాక గుండెపోటు, పక్షవాతం మరియు తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల నుండి దక్కాల్సిన 11 శాతం రక్షణ ప్రయోజనం పూర్తిగా శూన్యమైపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి 10 mm/Hg రక్తపోటు తగ్గడం వల్ల గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు 20 శాతం వరకు తగ్గుతాయి. కానీ మందులు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రయోజనాలు పూర్తిగా కోల్పోతారు.       BP control, heart health ESC 2026, why never skip blood pressure pills.
చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే మనకు ఎదురయ్యే శత్రువులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. శత్రువు అంటే కేవలం మనకు ప్రత్యక్షంగా హాని చేసేవాడు మాత్రమే కాదు, మన ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తి లేదా పరిస్థితి కూడా కావచ్చు. అందుకే ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకుండా, వారి ప్రవర్తనను గమనించాలని చాణక్యుడు సూచిస్తాడు. ఎవరు నిజంగా మన మంచిని కోరుకుంటున్నారు, ఎవరు మన బలహీనతలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. శత్రువు యొక్క బలాన్ని మాత్రమే కాకుండా, అతని బలహీనతలను కూడా తెలుసుకోవడం వ్యూహంలో కీలకమైన అంశం. ఎందుకంటే ఎంత బలమైన వ్యక్తికైనా కొన్ని బలహీనతలు తప్పకుండా ఉంటాయి. అయితే వాటిని తెలుసుకోవడానికి తొందరపడకుండా సహనం, పరిశీలన అవసరం. శత్రువు మాటలు, ప్రవర్తన, నిర్ణయాలు, అలవాట్లను గమనిస్తే అతని స్వభావం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అతను ఎప్పుడు కోపానికి గురవుతాడు, ఎప్పుడు భయపడతాడు, ఎలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడు అనే విషయాలను గమనించాలి. ఒక వ్యక్తి బలహీనతను తెలుసుకున్నంత మాత్రాన వెంటనే దాడి చేయడం చాణక్య నీతి కాదు. సరైన సమయం కోసం వేచి ఉండటం కూడా విజయానికి అవసరమైన వ్యూహమే. శత్రువు బలంగా ఉన్నప్పుడు నేరుగా పోరాడటం కంటే తెలివిగా పరిస్థితులను అంచనా వేయడం మంచిది. అవసరమైతే శత్రువు బలాన్ని అతనిపైనే ఉపయోగించుకునే విధంగా వ్యూహాన్ని మార్చుకోవాలి. మన బలాన్ని తెలుసుకోవడంతో పాటు ఎదుటివారి బలాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలు శత్రువుకు తెలియకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. ఎందుకంటే మన బలహీనతలు బయటపడితే అవే మనకు సమస్యగా మారవచ్చు. చాణక్యుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టాన్ని కలిగిస్తాయి. శత్రువుపై విజయం సాధించాలంటే భావోద్వేగాల కంటే బుద్ధిని ఉపయోగించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించుకోవచ్చు. ప్రతి సమస్యకు పోరాటమే పరిష్కారం కాదు, కొన్ని సందర్భాల్లో తెలివైన మౌనం మరియు వ్యూహం మరింత ప్రభావవంతంగా ఉంటాయి. శత్రువు బలంగా ఉన్నాడని భయపడకుండా, అతని బలహీనతలను గుర్తించి మనకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే ఇతరులకు అనవసరంగా హాని చేయడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం ఈ సూత్రం ఉద్దేశం కాదు. మన భద్రత, లక్ష్యం, విజయం కోసం పరిస్థితులను తెలివిగా అర్థం చేసుకోవడమే అసలు ఉద్దేశం. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. అందుకే శత్రువును తక్కువ అంచనా వేయకుండా, అతని సామర్థ్యాన్ని గౌరవిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరికి చాణక్య నీతి మనకు చెప్పేది ఒక్కటే—శత్రువు ఎంత బలంగా ఉన్నా, వివేకం, సహనం, సరైన వ్యూహంతో ముందుకు సాగితే విజయానికి మార్గం ఏర్పడుతుంది.
 ప్రేమ పేరుతో టైం పాస్ చేసేవాళ్ళను గుర్తించడం ఎలా.! ప్రేమ అనేది రెండు మనసుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. కానీ ఈ రోజుల్లో కొంతమంది ప్రేమ పేరుతో అవతలి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకుంటూ కాలక్షేపం  చేస్తుంటారు.  దీనికే టైమ్ పాస్ లవ్ అని పేరు. నిజమైన ప్రేమను, కాలక్షేపం చేసే మనస్తత్వాన్ని వేరు చేసి చూడటం మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, ఎదుటివారి ప్రవర్తనను కొద్దిగా గమనిస్తే సులభంగా పసిగట్టవచ్చు.  ఒక వ్యక్తి మీతో నిజమైన ప్రేమతో ఉన్నారో లేక కేవలం టైమ్ పాస్ చేస్తున్నారో గుర్తించడానికి కొన్ని లక్షణాలు గమనించడం చాలా సహాయపడుతుంది. అవేంటో తెలుసుకుంటే.. అవసరం ఉన్నప్పుడే గుర్తురావడం..  నిజంగా ప్రేమించే వ్యక్తి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తోడుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ టైమ్ పాస్ చేసేవారు వారికి బోర్ కొట్టినప్పుడు, కాలక్షేపం కానప్పుడు లేదా ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే మీకు కాల్స్ లేదా మెసేజ్లు చేస్తారు. మీరు మాట్లాడాలని అనుకున్నప్పుడు మాత్రం రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటారు. భవిష్యత్తు గురించి చర్చలు లేకపోవడం.. నిజంగా ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. కానీ  భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాటవేయడం,  పెళ్లి, కుటుంబం లేదా భవిష్యత్తులో కలసి ఉండే విషయాల గురించి ప్రస్తావన వస్తే, ఆ టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తారు. వారు కేవలం ప్రస్తుత ఆనందం లేదా లాభం కోసం  లేదా తమ సంతోషం కోసం మాత్రమే మీతో ఉంటారు తప్ప, జీవితాంతం  బంధంలో  ఉండాలని  ఆలోచించరు. సీక్రెట్స్.. ఎవరిని పరిచయం చేయకపోవడం..  ఏదైనా విషయాలను సీక్రెట్ గా ఉంచడం లేదా ఎవరినీ పరిచయం చేయకపోవడం చేసేవారు నిజంగా ప్రేమించలేదని అర్థం. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు తమ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు, అంటే..  స్నేహితులకు , కుటుంబ సభ్యులకు మిమ్మల్ని పరిచయం చేయడానికి ఉత్సాహం చూపుతారు. కానీ టైమ్ పాస్ చేసేవారు తమ బంధాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తారు. మిమ్మల్ని బహిరంగంగా పరిచయం చేయడానికి సంకోచిస్తారు. వ్యక్తిగత విషయాలపై ఆసక్తి లేకపోవడం..  మీ ఆశయాలు, మీ బాధలు, మీ ఆలోచనలను వినడానికి వారు పెద్దగా ఆసక్తి చూపరు. మీరు ఏదైనా మీ మనసులోని మాటను పంచుకుంటున్నప్పుడు వారు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం లేదా విననట్లు నటించడం, ఏదో  అర్జంట్ పని ఉందని తప్పించుకుని వెళ్ళిపోవడం చేస్తుంటారు. శారీరక లేదా తాత్కాలిక సంతోషాలకే వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మాటలు , చేతల మధ్య తేడా.. టైం పాస్ చేసే వారిలో కనిపించే అతిపెద్ద లక్షణం..  వారి మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం, గొప్ప వాగ్దానాలు చేయడం చేస్తారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఒక్కటీ నిలబెట్టుకోరు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సమాధానం లేదా సాకు సిద్ధంగా ఉంచుకుంటారు. ఎప్పుడూ అనుమానం లేదా అభద్రతా భావం కలిగిండడం..  టైం పాస్  చేసే వ్యక్తులతో  ఉన్నప్పుడు మీకు మానసిక ప్రశాంతత లభించదు. ఆ బంధంలో ఏదో లోపం ఉందనే అభద్రతా భావం మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. వారు మీ పట్ల చూపుతున్న శ్రద్ధ నిజమైనది కాదనే భావన మీ అంతరాత్మకు తరచుగా తడుతూనే ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఒకరి జీవితంలో మనం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నామో తెలుసుకోవడం చాలా అవసరం. సమయం, భావోద్వేగాలు ఎంతో విలువైనవి. కాబట్టి టైం  పాస్ చేసే వ్యక్తుల మాటలకు మోసపోకుండా, వారి ప్రవర్తనను గమనించి సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవడం మన మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది.                                    *రూపశ్రీ  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా.  అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ  ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి  గోరువెచ్చని కాపడాలు చాలా బాగా  సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే..  ఆ కడుపు నొప్పి కూడా వాంతులు,  జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను  అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.  వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.                                                                                                                                                   *రూపశ్రీ.