విమాన ప్రయాణం గాలిలో దీపమేనా.. వరుస సంఘటనలతో జనం బెంబేలు

Publish Date:Jun 16, 2025

Advertisement

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత్తుతున్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విమాన ప్రయాణమంటేనే బెంబేలెత్తేలా చేస్తున్నాయి. తాజాగా చెన్నైకు బయలు దేరిర బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 787  విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి లండన్ లోని హీత్రూ మిమానాశ్రయంలో దించారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా అహ్మదాబాద్ విమానానికి జరిగినట్లే ఈ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ ఫ్లాప్ అడ్జస్ట్ మెంట్ లోపం అని పేర్కొన్నారు. విమానం 9000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ లోపాన్ని కనుగొన్న పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.  

అలాగే  ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సకాలంలో ఆ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘజియాబాద్ లోని హిండన్ విమానాశ్నయం నుంచి టేకాఫ్ చేసే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వే పేనే నలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.   దీనిపై స్పందించిన ఎయిర్​ ఇండియా సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు  పేర్కొంటూ,  ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్​ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్​ ఇస్తామని ప్రకటించింది. 
ఇక ఆదివారం (జూన్ 15) అమెరికాలో ని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న జెటెబ్లూ విమానం రన్ వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ అప్రమత్తత కారణంగా ఘోర విప్తత్తు తప్పింది. 
ఇక జర్మనీ నుంచి హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎల్హెచ్ 752 విమానం బయలుదేరిన కొద్ది సేపటికి యూటర్న్ తీసుకుని వెనక్కు మళ్లించి ఫ్రాక్ ఫర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హైదరాబాద్ లో ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని లుఫ్తాన్సా సంస్థ ప్రకటించింది. అయితే.. బాంబు బెదరింపు కారణంగానే విమానాన్ని వెనక్కు మళ్లించినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో విమానప్రయాణమంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. 

By
en-us Political News

  
హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట.
వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు.
ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది.
ఆస్తిని పిల్లలకు పంచి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది.
తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్ వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(జూన్ 19) దారుణంగా హత్య చేశారు.
కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.