చాంపియన్ టీమ్ ఇండియా
మిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది . రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (83 బంతుల్లో 76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఛేజింగ్‌ను సులభం చేశాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29), కేఎల్ రాహుల్ (34) రాణించడంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత్ కు 252 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్య ఛేదనలో టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (31)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించాడు. టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంట్నర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (1)ని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్.. రచిన్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు.
ఆ తర్వాత అయ్యర్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో భాగస్వామ్యం నెలకొల్పారు. 60 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా (18) అవుటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (34) జడేజాతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, బ్రేస్‌వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (63), బ్రేస్‌వెల్ (53), రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) కీలక పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-wins-champion-trophy-39-194118.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.