టీమ్ ఇండియా టి20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ కు ఉద్వాసన పలికింది బీసీసీఐ. సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. టీమిండియాకు ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయనున్నారు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపినప్పటికీ, అతనిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా టీ20 పగ్గాలను అప్పగించాలని బీసీసీఐ దాదాపు నిర్ణయం తీసేసుకుంది. గురువారం (జూన్ 4) జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా వర్గాల సమాచారం. శనివారం (జూన్ 6) జరగబోయే సెలక్షన్ కమిటీ అధికారిక సమావేశంలో శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొననుండటంతో, అతని నియామకంపై అధికారిక ముద్ర పడటం కేవలం లాంఛనమేనని అంటున్నారు.
2023 డిసెంబర్‌లో భారత టీ20 జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ వేదికలపై తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఇటీవల అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో తన అమోఘమైన బ్యాటింగ్ శైలితో ఏకంగా 498 పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో అతను చూపించిన స్థిరత్వం, దూకుడు, మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతని సారథ్యంలోనే భారత యువ జట్టును బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ తన ప్టెన్సీ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించనున్నాడు.
మరోవైపు, భారత్‌కు విశ్వవిజేత కిరీటాన్ని మోపిన సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడంలో విఫలమౌతుండటమే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కారణంగా భావిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమయ్యాడు. ఆ నిరాశాజనక ఫామ్ ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ కొనసాగింది. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ మొత్తం సీజన్‌లో కేవలం 270 పరుగులకే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ వరుస వైఫల్యాలు, పేలవమైన ఫామ్ కారణంగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతడికి ఉద్వాసన పలకాలని సెలక్టర్లు భావించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-t20-captain-sreyas-ayyar-36-221858.html
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.