ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌కు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. సెమీస్‌లో భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన హార్దిక్‌పాండ్యా ఫైనల్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.
అదలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.
ఆ తర్వాత హార్దిక్ పరుగులు సాధించడంలో కొంత ఇబ్బంది పడినట్టు కనిపించాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన సిక్స్‌లతో మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు.గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఒకవేళ గాయం తీవ్రతరమైనది అయితే కనుక ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఫైనల్‌కు ముందు భారత జట్టు ఆందోళనలను పెంచుతుందనడంలో సందేహం లేదు.అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-star-allrounder-doubt-in-finals-25-193956.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.