జగన్ ‘నేను’.. చంద్రబాబు ‘మనం’

Publish Date:Mar 6, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమష్టి తత్వంతో  ముందుకు సాగుతారు. అందరినీ కలుపుకుపోతే విజయాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతారు. కలిసుందాం రా అంటూ అదరినీ కలుపుకుపోతారు చంద్రబాబు. ఏ విషయంలోనూ దాపరికం ఉండదు. పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తారు. ఇదే ఆయనను నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలోనే ఒక ఆదర్శవంతమైన నేతగా నిలుపుతూ వస్తున్నది. ఎన్నికలలో జయాపజయాలతో సంబంధం లేకుండా విలువలతో కూడిన రాజకీయాలను నెరపడంలో ఆయనకు ఆయనే సాటి. 

అయితే గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన జగన్ వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నం. అన్ని విషయాలలోనూ ఆయన ఏక్ నిరంజన్ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అందుకే ఒక్క విజయంతో విర్రవీగిపోయిన జగన్.. ఒక్క పరాజయంతోనే పతనానికి చేరుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, విభజన కష్టాలలో నిండా మునిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లలోనే అభివృద్ధి నమూనాగా నిలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని పరుగులెత్తించి ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయగలిగారు. 2014 నుంచి 2019 విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని  ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు చేయించారు. ప్రతి సోమవారంను పోలవారంగా ప్రకటించి వరుస సమీక్షలతో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పైగా పూర్తి చేయించారు. ఇక కేంద్రంతో తరచూ భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరిపారు. ఆ చర్చలన్నీ పారదర్శకంగా ఉండేవి. ప్రధాని మోడీలో భేటీకి ఆయన  ఒంటరిగా కాకుండా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లే వారు. చర్చించిన అంశాలు, దాని ఫలితం అన్నిటినీ మీడియాకు వెల్లడించేవారు.

సరే 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ మాత్రం ఎక్ నిరంజన్ అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పురోగమించడం అటుంచి తిరోగమనంలో సాగింది. ఆయన హస్తిన పర్యటనలన్నీ రహస్యోద్యమాలే. ఆయన కేంద్రం పెద్దలతో భేటీకి ఒంటరి యాత్రలే చేసేవారు. ఆ భేటీల్లో చర్చించిన అంశాలేమిటి? ఫలితం ఏమిటి వంటి విషయాలను ఆయన మీడియాకు వెల్లడించిన సందర్భమే లేదు. తరువాత ఎప్పుడో  తాపీగా ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదలయ్యేది. అంతే..

ఇప్పుడు తాజాగా చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆ భేటీలకు ఆయన కూటమి ఎమ్మెల్యేలను వెంట తీసుకుని వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు జరిపిన వరుస భేటీలలో ఆయనతో పాటు కూటమి పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రులతో  చర్చించిన అంశాలేమిటి? వాటిపై కేంద్ర మంత్రుల స్పందన ఏమిటి? అన్న విషయాలన్నిటినీ చంద్రబాబు మీడియాకు వివరించారు. 

అదే జగన్ విషయానికి వస్తే సీఎంగా ఆయన పలుమార్లు హస్తిన పర్యటించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కానీ ఏ భేటీలోనూ ఆయన వెంట అప్పట్లో వైసీపీ నేతలు కానీ, ఎంపీలు కానీ లేరు. ఆఖరికి అప్పట్లో ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన విజయసాయిరెడ్డి కూడా ఉండేవారు కాదు. జగన్ వెంట వారంతా మంత్రుల నివాసాల వరకూ మాత్రమే తమ అధినేత వెంట ఉండటానికి అవకాశం ఉండేది. లోపలికి మాత్రం జగన్ ఏక్ నిరంజన్ అన్నట్లుగా ఒక్కేడే వెళ్లే వారు. అక్కడ ఆయన చర్చించిన అంశాలేమిటి? అన్నది బ్రహ్మ రహస్యంగానే ఉండేవి. ఇదీ చంద్రబాబుకు, జగన్ కు ఉన్న తేడా. జగన్ ‘నేను’ అన్న అహంతో వ్యవహరించేవారు. చంద్రబాబు మాత్రం ‘మనం’ అన్న సమష్టితత్వాన్ని చాటారు, చాటుతున్నారు. 

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.