ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

Publish Date:Jun 20, 2026

Advertisement

 ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండిచా  క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం (జూన్ 20)  చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది.  ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు బ్యాటింగ్ ప్రారంభించకుండానే ఐదు పరుగులు వచ్చాయి.   ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో అంపైర్లు పెనాల్టీ రూపంలో భారత్‌కు ఐదు అదనపు పరుగులు కేటాయించారు. దీనివల్ల భారత ఇన్నింగ్స్  5/0 స్కోరుతో మొదలైంది.

ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది.   దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.

ఈ విధ్వంసకర ఆరంభాన్ని భారత ఓపెనర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో కేవలం 28.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు చేశాడు.  యశస్వి జైస్వాల్ 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్   20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.

భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ  కేవలం 23 పరుగులు   ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.అంతే  కాకుండా చెన్నై చిదంబరం స్టేడియంలో   ఐదు వికెట్లు తీసిన తొలి ఇండియన్  పేసర్‌గా  నిలిచాడు.  ప్రసిద్ధ్ ధాటికి  36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆప్ఘన్ జట్టును   ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆదుకున్నాడు. కెప్టేన్స్ ఇన్నింగ్స్ ఆడిన . హష్మతుల్లా షాహిది 102 పరుగులు చేశాడు. ఇది హష్మతుల్లా షాహిది    కెరీర్‌లో తన తొలి వన్డే సెంచరీ.  అతనికి తోడుగా ఒమర్జాయ్  కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో  ఆప్ఘనిస్థాన్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.  

By
en-us Political News

  
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.