పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..!
Publish Date:Aug 7, 2026
Advertisement
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది". ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు. అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి. దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి. దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే.. ఇది చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం, సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది. పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/teach-your-kids-these-habits-to-set-them-up-for-success-35-228271.html





