యాక్టివ్ అవుతున్న టీడీపీ యువతరం వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీ

Publish Date:Oct 17, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీలో యువ తరంగం మరింత యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీకి వైసీపీ గ్రహణం నుంచి విముక్తి కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి ఆ పార్టీలోని డైనమిక్ యువ నేతలు మరింత ఉత్సాహంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ టీడీపీ రాజకీయాల్లో తాజాగా అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రకు మద్దతుగా పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ రాజమండ్రి వచ్చారు.

ఈ నేపథ్యంలో వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ రాజమండ్రిలో ఓ రహస్య ప్రాంతంలో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ ను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రాధా, శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీల నేత,  లోక్ సభ స్పీకర్ దివంగత  జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు యువనేతల అపూర్వ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందులోనూ ఇరు ప్రాధాన్యతా కుటుంబాల వారసులు రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి కోస్తాంధ్రలోను మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతకు మించి విజయవాడలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.  అలాగే.. పరిటా శ్రీరామ్ కుటుంబానికి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. తాడిత పీడిత, పేద ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర ఉన్న కుటుంబాలకు వారసులు రాధా- శ్రీరామ్. పేదలకు అండగా ఉన్న క్రమంలోనే వంగవీటి రంగా, పరిటాల రవి అసువులు బాసారు. ఈ రెండు కుటుంబాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ రాజమండ్రిలో భేటి అవడం, వారితో మరో యువనేత గంటి హరీశ్ కూడా జత కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి అపూర్వ సమావేశం  రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ముగ్గురూ కూడా మూడు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.

గతంలో వంగవీటి రాధాపై రెక్కీ ఘటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని, రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ సందర్భంగా శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి కుటుంబం అంటే మామూలు కుటుంబం అనుకుంటున్నారా? అని శ్రీరామ్ ఘాటుగా ప్రశ్నించారు. అప్పటికి ఈ యువనేతలిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇరువురూ టీడీపీలో డైనమిక్ లీడర్లే. అలాంటి యువ నేతలు ఇప్పుడు తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమై ఏ విషయాలు చర్చించారనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ అక్కసుతోనే అధికార వైసీపీ వీరిరువురినీ ఇబ్బందులు పెట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. రాధాపై రెక్కీ నిర్వహించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాధాను నిర్మూలించాలనే కుట్ర ఈ రెక్కీ వెనుక ఉన్నట్లు తర్వాత బయటపడింది.

వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీపై సోషల్ మీడియాలో పలువురు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు పులి బిడ్డలు కలిశారంటే చరిత్ర తిరగరాసినట్లే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల రవి, వంగవీటి రంగా ఇద్దరూ సింహాలని, ఆ సింహాల కొడుకులు రాధా, శ్రీరామ్ తొలిసారి భేటీ అవడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్- గంటి హరీశ్ భేటీ అవడం కూడా టీడీపీలో యువతలో మరింత చైతన్యం తీసుకొచ్చే వ్యూహాల గురించి వీరు చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వీరి మధ్య ఏవో కీలకమైన అంశాల మీదే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగి ఉండొచ్చాని భావిస్తున్నారు.  మొత్తానికి రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడమే ఆశ్చర్యకరమైతే.. వారితో బాలయోగి కుమారుడు హరీశ్ జత కలవడం అపురూపమైన, అరుదైన ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా వీరి కలయిక సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కలయిక ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యంగా పెచ్చుమీరిన నియంతృత్వ వైఖరితో ఉన్న వైసీపీ నేతల్లో కలవరం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.