అనంతలో దూసుకొస్తున్న టీడీపీ యువ కెరటం పరిటాల శ్రీరామ్

Publish Date:May 6, 2022

Advertisement

ఏపీ రాజకీయ చరిత్రలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ‘పరిటాల కుటుంబం మాటే శాసనం’ అన్నట్లు ఉంటుంది. ఆ కుటుంబం అధికారంలో ఉన్నా.. లేకపోయినా పరిటాల ఫ్యామిలీ మాటే ఫైనల్ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ యువ కెరటం దూసుకొచ్చింది. ఆ యువ కెరటమే పరిటాల శ్రీరామ్. మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర (రవి), మాజీ మంత్రి సునీత దంపతుల కొడుకు శ్రీరామ్.

ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ బాధ్యతల్ని ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తున్నారీ యువనేత శ్రీరామ్. పరిటాల రవి, సునీత దంపతుల వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రీరామ్ గత ఎన్నికల్లో రాప్తాడులో టీడీపీ అభ్యర్థిగా ఓటమి చవిచూశారు. ఓడినప్పటికీ రాప్తాడు టీడీపీపై పరిటాల శ్రీరామ్ పట్టు ఏమాత్రం తగ్గలేదంటే ఆశ్చర్యంలేదు. రాప్తాడు టీడీపీ శ్రేణులకు శ్రీరామ్ ఎంత చెబితే అంత అనే టాక్ ఉంది. తన కుటుంబం నుంచి సహజంగా పుణికిపుచ్చుకున్న రాజకీయ చైతన్యంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి ముందుంటారు. పరిటాల శ్రీరామ్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చక్కని అనుబంధం ఉంది. టీడీపీలో శ్రీరామ్ మంచి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు..

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శ్రీరామ్ రెడీ అవుతున్నారు. తాను చెబితే పార్టీ అధినేత చెప్పినట్లే అనేలా ధర్మవరంలో దూసుకుపోతున్నారు శ్రీరామ్. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కష్టాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు.

ధర్మవరంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ కమలం గూటిలో చేరడంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ ఓ టార్చ్ బేరర్ లా నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు. అయోమయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జనం నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్ శ్రీరామ్ జోరు పెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పంచ్ డైలాగ్ లతో టీడీపీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఆయన ప్రసంగాలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శ్రీరామ్ జోష్ చూసిన టీడీపీ అధినేత ధర్మవరం పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ధర్మవరానికి నియోజకవర్గం నేతలు తెచ్చుకున్నారంటే.. శ్రీరామ్ పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతోంది.

ధర్మవరంలో ఆయన మంచి పునాదినే వేసుకున్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసాగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా శ్రీరామ్ తప్పకుండా హాజరై అందరికీ తలలో నాలుకలా మెలుగుతున్నారు. తరచూ పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా శ్రీరామ్ మరింత యాక్టివ్ గా పనిచేయడం అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు కూరగాయల పంపిణీ, భోజనం ఏర్పాట్లు చేయడం, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేసి శెభాష్ అనిపించుకున్నారు.

సీఎం జగన్ కు ఎదురొడ్డి నిలిచేందుకు కూడా శ్రీరామ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సీమలో దివంగత పరిటాల రవి ఇమేజ్ ను కాపాడుతూనే జిల్లా రాజకీయాల్లో తన మార్క్ కనబరుస్తున్నారు. జిల్లాల పునర్విభజన వెనుక జగన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని, ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడానికి నిరసనగా నిరాహార దీక్షచేశారు. ధర్మవరం రెవన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి దశాబ్దాల శత్రుత్వం ఉంది. అలాంటి శత్రువర్గంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా కౌగలించుకునేట్టుగా ఆకర్షించడం శ్రీరామ్ ఇమేజ్ కు తార్కాణం అంటున్నారు.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని పార్టీ అధినేత ప్రకటించడం పరిటాల శ్రీరామ్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. శ్రీరామ్ కు ధర్మవరం టీడీపీ టికెట్ వస్తే.. అతని గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనేది స్థానికుల అంచనా. పోరాటాల రవన్న కుమారుడు.. రాజకీయాల్లో మంచి దూకుడు ప్రదర్శిస్తున్న శ్రీరామ్ ధర్మవరం నుంచి జెండా ఎగరేయడం ఖాయం అంటున్నారు.

By
en-us Political News

  
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.