'ఐఏఎస్ లు గరం గరం... నిమ్మగడ్డకు బాసట' అంటూ తప్పులో కాలేసిన తెలుగుదేశం

Publish Date:Apr 12, 2020

Advertisement

* "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" పేరిట ట్విట్టర్ లో పోస్ట్ అయిన సందేశం 
* తెలుగు దేశం క్లెయిమ్ చేసినట్టు దీన్ని ఐ ఏ ఎస్ లు నడపడం లేదు..
* ప్రద్యుమ్న సింగ్ అనే వ్యక్తి "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" ట్విట్టర్, ఫేస్ బుక్ లకు హ్యాండ్లర్ గా ఉన్నాడు 
* FB పేజీ about లో ఉన్న విషయం మీరే చదవండి: IAS Fraternity shapes India's public administration, policy formulation & implementation. Our RTs & tweets DON'T represent official stand of IAS Association.

జాతీయ స్థాయిలో విజ్ఞులు ఛీ కొడుతున్నారంటూ-భారత ఐ ఏ ఎస్ అధికారుల సంఘం పేరిట తెలుగుదేశం ట్వీట్, ఆ లింక్ ఇదే -

https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1


కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉండాల్సిన ప్రభుత్వం... కక్ష రాజకీయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడం పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన ట్విట్టర్ లింక్ లను కూడా షేర్ చేసింది. 

1. https://twitter.com/IASfraternity/status/1248942073748656130

2. https://twitter.com/IASfraternity/status/1248681035790835712

3. https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1

అలాగే- IAS fraternity మరొక ట్వీట్ కూడాచేసింది--" When IAS officers are busy in crisis management. Shameless Andhra Pradesh Govt brings notification to remove its State Election Commissioner Dr. N. Ramesh Kumar, retd. IAS due to ‘caste bias’ and another notification first of its own kind in which SEC will be a retd. HC judge." తొలిసారిగా ఇంత హార్ష్ ట్వీట్ ఆ గ్రూప్ నుంచి వెలువడటంతో రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం తో ఐ ఏ ఎస్ లు ఎంత గరం గరం గా ఉన్నారో అర్ధం అవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. కానీ, వాస్తవానికి చూస్తే, ఐ ఏ ఎస్ అధికారుల జాతీయ సంఘానికీ, తెలుగుదేశం పార్టీ ట్వీట్ కూ ఎలాంటి సంబంధమూ లేదనేది, FB హ్యాండ్లర్ ప్రద్యుమ్న సింగ్ about ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా తెలిసిపోయింది.

ఐ ఏ ఎస్ అధికారులు ఏదైనా ఒక సమాచారం మీడియాకు ఇవ్వదలిస్తే, ప్రాపర్ గా ఆ సమాచారాన్ని అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, బాధ్యుల సంతకంతో రిలీజ్ చేస్తారు. ఇక్కడ అది జరగలేదు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి, ఆయనకు కులం ఆపాదించి ఎంత అప్రదిష్ట పాలైందో, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, ట్విట్టర్ వేదికగా అదే స్థాయి లో నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మైలేజ్ పొందాలని అభాసు పాలయ్యారు. ఈ విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి, అలాగే విపక్ష టీ డీ పీ కూడా దొందూ దొందే పద్దతి లో వ్యవహరించి, జనం దృష్టిలో పలుచనయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం లో నుంచి, తెలుగుదేశం పార్టీ ఇలా అవకాశం సృష్టించుకుందన్న మాట! భేష్!!!

https://twitter.com/IASfraternity/status/1248681035790835712

 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.