తెలంగాణ పంచాయతీ ఎన్నికల బరిలో తెలుగుదేశం?.. చంద్రబాబు వ్యూహమేంటి?

Publish Date:Dec 31, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డులు సృష్టించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలూ పడిన జనం స్వచ్ఛందంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గతంలో ఎన్నడూ లేనంత అధికంగా తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన లభించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అంతగా పట్టు లేదని భావించే రాయలసీమ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా మారింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.  

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండీ సీఎం చంద్రబాబు   తెలంగాణ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.   తెలంగాణలో నిర్వహించిన పార్టీ  సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభించింది. వాస్తవానికి తెలంగాణలో పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ బలం ఉంది. క్యాడర్ ఉంది. రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే  దానిని క్రియాశీలంగా మార్చేందుకు అవసరమైన నాయకత్వం మాత్రం కరవైంది. రాష్ట్ర విభజన తరువాత పార్టీని నేతలు వీడికా క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందని పరిశీలకులు పలు సందర్భాలలో సోదాహరణగా విశ్లేషణలు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలుగుదేశం క్యాడర్ ది చాలా కీలకమైన పాత్ర అని పరిశీలకుల భావన. 

ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా తెలంగాణపై దృష్టి సారించడంతో ఇంత కాలం వేరే వేరే పార్టీలలో ఉన్న నేతలు ఒకరి తరువాత ఒకరుగా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు ఇప్పటికే బాహాటంగా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే మాజీ మంత్రి బాబూమోహన్ సైతం తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక  తాజా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి నెలలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయడానికి సమాయత్తమౌతోంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, అటు పిమ్మట 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందు కోసం త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనం గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్,  రాబిన్ శర్మలతో చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో  గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కేడర్   బలంగా ఉందని, అయితే క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వమే కరవనీ తేలింది. దీంతో ఆ కొరతను తీర్చేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని అంటున్నారు.  ఇందు కోసం రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల పంచన చేరిన నాయకులను సొంత గూటికి చేరేందుకు తలుపులు బార్లా తెరిచినట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. మాజీలంతా తెలుగుదేశం గూటికి చేరితే రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తథ్యమని అంటున్నారు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.