తమిళనాడు మంత్రిగా టీడీపీ సోషల్ మీడియా మెంబర్ కీర్తన

Publish Date:May 11, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రస్థానం మొదలైన రోజు మరో పేరు తెలుగు ప్రజలతో సహా అందరి దృష్టిని ఆకర్షించింది. టీవీకే  అధినేత విజయ్  కేబినెట్‌లో చోటు దక్కించుకున్న యువ నాయకురాలు ఎస్. కీర్తన ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆ యువతి  తెలుగమ్మాయి కావడం..  ఒకప్పుడు హైదరాబాద్‌లో తెలుగుదేశం సోషల్ మీడియా టీంలో పనిచేయడం.. ఇప్పుడు తమిళనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు.  ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రాజకీయ వ్యూహాలపై ఆసక్తి పెంచుకున్న కీర్తన.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో చేరారు.

 గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకురాలిగా పనిచేసిన కీర్తన.. 2021 తమిళనాడు ఎన్నికల సమయంలో ఎం.కె. స్టాలిన్ టీంకు కూడా సేవలందించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో  తెలుగుదేశం సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ పనిచేసిన అనుభవంతో తెలుగుపై మంచి పట్టు సాధించిన కీర్తన.. తెలుగు, తమిళ భాషల్లో  అనర్గలంగా మాట్లాడగల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె చురుకుదనం ఆమె రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. శివకాశి నియోజకవర్గ సమస్యలపై వీడియోలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన కీర్తన.. తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

యువతలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఈ ఫాలోయింగ్‌ను గమనించిన విజయ్ టీం.. ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే శివకాశి అసెంబ్లీ టికెట్‌ను కీర్తనకు కేటాయించింది.  టికెట్ దక్కిన తరువాత కీర్తన తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పలుచోట్ల తెలుగులో మాట్లాడి తెలుగు ఓటర్లను, యువతను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా ప్రభావాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఆమె ప్రచారం శివకాశిలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.

శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. అశోకన్‌పై   11 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి..  ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. తొలి ఎన్నికలకే ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవడం ఆమె రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా మారింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు తమిళనాడు మంత్రివర్గం వరకూ చేరుకోవడంతో కీర్తన పేరు తమిళ రాజకీయాల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. యువత, మహిళలు, సోషల్ మీడియా శక్తిని రాజకీయ విజయంగా మలుచుకున్న కొత్తతరం నాయకురాలిగా ఆమెను పలువురు అభివర్ణిస్తున్నారు.

By
en-us Political News

  
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.