లైంగిక వేధింపుల ఆరోపణలు.. సత్యవేడు ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

Publish Date:Sep 5, 2024

Advertisement

లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  పార్టీ నుంచి సస్పెండ్  అయ్యారు.  ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించారు. సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించినట్లుగా ఓ మహిళ చేసిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.  ఆదిమూలంపై ఆరోపణల విషయం చంద్రబాబు దృష్టికి రాగానే ఆయన సీరియస్ అయ్యారు. ముందు సస్పెండ్ చేయండి, ఆ తరువాత వివరణ తీసుకుందామంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశించారు.  

చంద్రబాబు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వైసీపీ హయాంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కనీస చర్యలు తీసుకోకుండా వారిని జగన్ వెనకేసుకు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ చంద్రబాబు తప్పులను ఇసుమంతైనా ఉపేక్షించరనడానికి ఆదిమూలంపై తక్షణ చర్యే నిదర్శనం అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు, అవంతి, గోరంట్ల వంటి నాయకులపై ఆరోపణలు వచ్చినా పార్టీ పరంగా వారిపై జగన్ ఎటువంటి చర్యలూ తీసుకోని విషయాన్ని గుర్తు చేస్తూ, చంద్రబాబు తమ పార్టీ నేతల క్యారెక్టర్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.