లవ్లీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత: క్యాంపస్‌ భవనాలకు నిప్పు.!

Publish Date:Sep 27, 2026

Advertisement

పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వదంతులు వ్యాపించాయి. ఈ తప్పుడు ప్రచారం క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించడంతో సుమారు 2 వేల మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గర్ల్స్ హాస్టల్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోతూ యూనివర్సిటీకి చెందిన పలు ఆస్తులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, కొన్ని భవనాల వద్ద నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. సమీపంలోని నేషనల్ హైవేను విద్యార్థులు పూర్తిగా దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ భారీ ఆందోళనపై కపుర్తలా ఎస్‌ఎస్పీ గౌరవ్ తూరా స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. క్యాంపస్‌లోని వ్యవసాయ విభాగం సమీపంలో నాలుగైదు రోజుల క్రితం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. అయితే, ఆ మహిళ మృతికి గానీ, వర్సిటీలో అత్యాచారం జరిగినట్లు గానీ తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అత్యాచారం జరిగిందనే వాదనలకు ఇప్పటివరకు కనీసం ఒక్క ఆధారం కూడా లభించలేదని తేల్చిచెప్పారు. పోలీసులు, వర్సిటీ అధికారులు ఎంతగా నచ్చజెప్పినా విద్యార్థులు శాంతించకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై ఎల్‌పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటీ తీవ్రంగా స్పందించారు. వర్సిటీలో అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. కొందరు కావాలనే తప్పుడు, నిరాధార సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ కూడా ఇటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. హైవేపై నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం యూనివర్సిటీ యాజమాన్యం  ఆందోళన చేస్తున్న విద్యార్థుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి విద్యార్థులు సంయమనం కోల్పోవద్దని అధికారులు మరోసారి హెచ్చరించారు.

 

 

 

 

[ LPU Campus, Lovely Professional University, Punjab, Kapurthala, Student Protest, Viral Rumours, Social Media Rumours, Campus Violence, Student Agitation, Highway Blockade, University Protest, Gaurav Toora ]

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.