చంద్ర‌య్య‌ది 33వ హ‌త్య‌.. వైసీపీ ర‌క్త‌చ‌రిత్ర‌...

Publish Date:Jan 14, 2022

Advertisement

32 నెలలు.. 33 మంది హత్య. ఇదీ వైసీపీ ర‌క్త‌చ‌రిత్ర‌. అధికారంలోకి రాగానే.. రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు మొద‌లుపెట్టేశారని అంటున్నారు. క‌డ‌ప ఫ్యాక్ష‌న్‌ను ఏపీ అంత‌టా విస్త‌రించారని విమ‌ర్శిస్తున్నారు. దారికి రాని తెలుగు త‌మ్ముళ్ల‌ను.. దారికి అడ్డు లేకుండా క‌డ‌తేరుస్తున్నారు. ఒక‌టా రెండా.. గ‌డిచిన 32 నెల‌ల్లో రాష్ట్రాంలో 33 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అంటే.. నెల‌కో నాయ‌కుడి చొప్పున‌ హ‌త్య‌! ఇంత‌టి దారుణం ఇంకెక్క‌డైనా ఉంటుందా.. ఏపీలో ప్ర‌జాస్వామ్య‌మా?  రౌడీ రాజ్య‌మా? అంటూ టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. చంద్ర‌య్య దారుణ హ‌త్య‌తో వైసీపీ హ‌త్యా రాజ‌కీయాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌జ‌లను ఈ రాక్ష‌స పాల‌న‌కు భ‌య‌కంపితుల‌ను చేస్తోంది. చంద్ర‌య్య హ‌త్యే ఆఖ‌రి రాజ‌కీయ హ‌త్య కావాల‌ని అంతా కోరుకుంటున్నారు. తాజాగా, వైసీపీ నేత‌ల చేతిలో హ‌త్య‌కు గురైన తెలుగుదేశం నేత‌ల జాబితా విడుద‌ల చేశారు.  

అధికార పార్టీ వారి చేతిలో హ‌త్య‌కు గురైన 33మందిలో బలహీన వర్గాలకు చెందినవారే 20 మంది వరకూ ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. జిల్లాలవారీగా చూసినప్పుడు ఎక్కువ హత్యలు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనే జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పల్నాడులోని దాచేపల్లి మండలం తంగెడ లో బత్తుల సుబ్బులు అనే బీసీ మహిళా కార్యకర్త హత్యకు గురయ్యారు. అదే మండలం భట్రుపాలెంలో తేజావత్‌ రాజు నాయక్‌, తంగెడలో సయ్యద్‌ జాన్‌, గురజాల మండలం పాత అంబాపురంలో దోమతోటి విక్రమ్‌, దాచేపల్లి మండలం నారాయణపురంలో తమ్మిశెట్టి నీలకంఠ బాబు, అదే మండలంలో కాపు సామాజిక వర్గ నేత, మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు, దుర్గి మండలం జంగ మహేశ్వరపాడులో నరెద్దుల కోటయ్య, మాచవరం మండలం పిన్నెల్లిలో ఖాదర్‌ భాషా హత్యకు గురయ్యారు.

2019లో ఎన్నికలకు ముందు నుంచి అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల హత్యల పరంపర మొదలైంది. ధర్మవరంలో చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌, తాడిపత్రి మండలం వీరాపురంలో చింతా భాస్కరరెడ్డి, బత్తులపల్లి మండలం పత్యాపురంలో రాజప్ప, అనంతపురం రూరల్‌ మండలం భైరవ నగర్‌లో ఆదినారాయణ, రాయదుర్గం మండలం మలకాపురంలో గొల్ల గోపాల్‌ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలో చిన గంజాం మండలం రుద్రమాంబపురంలో మత్స్యకార మహిళను వివస్త్రను చేసి వేధించి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారు. ఇదే జిల్లా బల్లికురవ మండలం కొత్తూరులో అర్జున్‌ నాయక్‌, సంతమాగులూరు మండలం కామేపల్లిలో లక్కపోగు సుబ్బారావు హత్యకు గురయ్యారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉమా యాదవ్‌, నెల్లూరు జిల్లా మినగల్లుకు చెందిన చిట్టిబోయిన వెంగయ్య, కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం గొల్లల మందలో పాలకొల్లు సోమయ్య, ఇదే జిల్లాలో గరికపాటి కృష్ణారావు, నాగాయలంక మండలం పర్రచివరలో తాతా సాంబయ్య, కర్నూలు జిల్లా చింతాళంలో మంజుల వడ్డె సుబ్బారావు, నిడ్డూరులో శ్రీనివాసులు, పెసరవాయిలో మాజీ సర్పంచి వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప రెడ్డి, విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెద పెంకి లో దత్తి వెంకటరావు, చిత్తూరు జిల్లా తొట్టెంబేడులో మేలుపాక గోపి, తిరుపతి నగరంలో భరత్‌ యాదవ్‌, కడప జిల్లా కాశినాయన మండలం నరసాపురంలో గురప్ప, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపంలో ఊట్కూరి వీరబాబు, జగ్గంపేట మండలం గొల్లలగుంటలో పీ శ్రీనివాస రెడ్డి హత్యకు గురైన వారిలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

By
en-us Political News

  
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.