‘గ్రేటర్’ఎన్నికలప్రచారానికి బాబు వస్తారా?

Publish Date:Nov 13, 2020

Advertisement

రమణ పెత్తనం వద్దంటున్న సీనియర్లు

 

ఎవరి ఖర్చు వారిదేనట

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. సరకు సరంజామాతో సిద్ధమవుతున్నాయి. కానీ, ఒకప్పుడు కార్పోరేషన్‌లో అధికారం సాధించిన తెలుగుదేశం పార్టీని, నాయకత్వం ఇంకా సన్నద్ధం చేస్తున్నట్లు కనిపించడం లేదు. సెటిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే మున్సిపల్ డివిజన్లలో అయినా,  ఈసారి పార్టీ ప్రభావం చూపుతుందో లేదో కూడా నేతలకు అర్ధం కావడం లేదు. అసలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా.. గణనీయమైన ఓట్లు సాధించిన టీడీపీ, ఈసారి అత్యంత స్తబ్దుగా ఉంది. ఏపీకి సంబంధించిన సీనియర్లను డివిజన్ల వారీగా మోహరింపచేసి.. ఎన్నికల యుద్ధాన్ని టీఆర్‌ఎస్-టీడీపీకి పరిమితం చేసింది. ఆ తర్వాత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని దాదాపు వదిలేశారు. దానితో నగరంలో క్యాడర్ ఉన్నప్పటికీ టీడీపీ చతికిలపడవలసి వచ్చింది. ఓటుకు నోటు కేసు తర్వాత.. కేసీఆర్‌తో జరిగిన అంతర్గత అవగాహన మేరకే, బాబు తెలంగాణలో పార్టీ కాడి కిందపడేశారన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అరవిందకుమార్ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన, దయాకర్‌రెడ్డి, సాయిబాబా, నర్శిరెడ్డి వంటి గొంతున్న నేతలున్నా.. వారు అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు కురిపించకపోవడానికి, నాయకత్వం నుంచి ఆ మేరకు ఆదేశాలు రాకపోవడమే కారణమంటున్నారు.

 

ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో కూడా.. ఇతర పార్టీలను విమర్శించవద్దని, బాబు ఆదేశించడంపై నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎవరినీ విమర్శించకుండా.. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన, అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేయాలని బాబు సూచించారట. కొన్నేళ్ల క్రితం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెబితే, వినేదెవరని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టకపోతే, ప్రజలు తమ పార్టీ ప్రత్యామ్యాయంగా ఎందుకు ఎంచుకుంటారని నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

నగరంలో కష్టం మీద కమిటీలు పూర్తి చేసిన నగర నాయకులకు.. ఇప్పుడు కొత్త సందేహం తెరపైకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో అధినేత చంద్రబాబు వస్తారా? రాదా? అన్నదే ఆ సందేహం! ఆయన ప్రచారానికి వస్తేనే పార్టీకి అంతో ఇంతో ఊపు-కార్యకర్తల్లో ఉత్సాహం వస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో లోకేష్  విస్తృతంగా ప్రచారం చేశారు. తాను పక్కా హైదరాబాదీనని ఆయన చెప్పారు.  అయినా ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఈసారి ఎన్నికల్లో పొత్తు ఉండదని బాబు స్పష్టం చేశారట.

 

ఎన్నికల సందర్భంగా అభ్యర్ధులకు, నిధులిచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లోనే అభ్యర్ధులకు నిధులివ్వకుండా, చేతులెత్తేశారు. అనేకమందికి ఇప్పటివరకూ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి.  నగరంలో 25 డివిజన్లలో సెటిలర్ల ప్రభావం నేరుగా ఉండగా, మరో 20 డివిజన్లలో వారే విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. సనత్‌నగర్, కూకట్‌పల్లి,  శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ.  మరి కనీసం అక్కడయినా పార్టీ అభ్యర్ధులకు నిధులిస్తారో, లేదో చూడాలంటున్నారు.

 

ఇప్పటికయితే, పోటీ చేసే అభ్యర్ధులకు పార్టీ నుంచి నిధులు రావని, నేతలు నిర్మొహమాటంగా చెబుతున్నారు. కేవలం నామినేషన్లు, ప్రచారానికే పరిమితం కావాలంటున్నారు. గతంలో అయితే.. ఆర్ధిక వ్యవహారాల నియంత్రణ వ్యవహారం, చంద్రబాబు చేతిలో ఉండేది. ఎన్నికల ఖర్చు విషయంలో, చంద్రబాబు చాలా ఉదారంగా ఉంటారన్న పేరుండేది. కానీ గత ఐదేళ్ల నుంచి ఆర్ధిక వ్యవహారాల్లో ఆయన ప్రమేయం తగ్గిపోయి, లోకేష్ నిర్వహణలోకి వెళ్లిందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అభ్యర్ధులకు నిధులపై, ఇక ఆశ వదులుకోవలసిందేనని.. ఖర్చు విషయంలో.. బాబుకు-లోకేష్‌కు చాలా తేడా ఉండటమే దానికి కారణమని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

కాగా, టీడీపీ నుంచి బీజేపీ-టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ద్విత్రీయ శ్రేణి నేతలకు, ఆయా పార్టీల్లో పెద్దగా ఆదరణ లభించడం లేదన్న విషయం, టీడీపీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. టీడీపీలో ఉన్నప్పటి గౌరవం, మిగిలిన పార్టీలో కనిపించడం లేదని, పార్టీ మారిన నేతలు వాపోతున్నారట. ఒక్క సనత్‌నగర్, కంటోన్మెంట్, ముషీరాబాద్‌లోనే ఈ పరిస్థితి కొంచెం తక్కువగా ఉందంటున్నారు. అయితే, వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలకు.. వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు, సమాధానం చెప్పడం కష్టమవుతోందట. రేపు పార్టీలోకి వస్తే, చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారిస్తారా? ఆయన ఆంధ్రాకు పరిమితమయితే మళ్లీ మా పరిస్థితి ఏమిటి? అసలు సార్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అన్న ప్రశ్నలకు తమ్ముళ్లు జవాబివ్వలేకపోతున్నారట.

 

అయితే, గ్రేటర్ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో, పార్టీ అధ్యక్షుడు రమణ ప్రమేయాన్ని ఒప్పుకునేది లేదని నగర నేతలు స్పష్టం చేస్తున్నారు. గత గ్రేటర్, తర్వాత జరిగిన అసెంబ్లీ టికెట్లలో రమణ వైఫల్యం వల్లనే, పార్టీ ఓడిందని వారు గుర్తు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో.. తనను ప్రసన్నం చేసుకున్న అనర్హులకు సైతం టికెట్లు ఇవ్వడం ద్వారా, పార్టీ ఓటమికి కారణమయ్యారన్న విమర్శలు ఇంకా మర్చిపోలేదంటున్నారు. నగరంలో పార్టీపై ఇప్పటివరకూ దృష్టి సారించని రమణకు, టికెట్ల పంపిణీలో జోక్యం చేసుకునే నైతిక హక్కు లేదని తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.