తెలుగు దేశం 3..o వెర్షన్.. నారా లోకేష్.!

Publish Date:Sep 9, 2026

Advertisement

తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు. 
జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.

ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు. 

జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు.

పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. 


[TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.