మహానాడుపైనే అందరి దృష్టీ

Publish Date:May 25, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించి.. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా అని పిలుపు ఇవ్వగానే.. తెలుగు నేలపైన ఉన్న ప్రజలంతా ప్రభంజనంలా కదిలారు.

అంతే పార్టీ స్థాపించిన జస్ట్ 9 నెలల్లోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని.. తెలుగువాడిలోని వాడిని.. వేడిని..చురుకుని.. చమక్కుని డిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానానికి తగిలేలా.. తెలిసేలా చేయడమే కాదు.. అప్పటి వరకు రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. హైదరాబాద్‌లోని హస్తం పార్టీ ముఖ్యమంత్రులు.... ఢిల్లీ అధిష్టానానికి తెలిపి... వారి నిర్ణయం వచ్చే వరకు చేతులు కట్టుకొని చేష్టలుడిగి... ఆధిష్టానం నిర్ణయం కోసం వెయిటింగ్‌ చేయడం.. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఆధిష్టానం దూతలు.. సీల్డ్ కవర్‌ ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించడం.. అదే విధంగా అంతర్గత ప్రజాస్వామ్యనికి కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో రేగిన అసమ్మతి రాగాన్ని సవరించేందుకు ఢిల్లీ నుంచి భాగ్యనగరానికి చేరిన దూతలు... కూల్ కూల్ అంటూ అసమ్మతి నేతలను కూల్ చేయడం వంటి వగై రాజకీయాలకు హోల్‌సేల్‌గా చెక్ పెట్టిన ఒకే ఒక్కడు.. మూడుక్షరాల మహాశక్తి ఎన్టీఆర్. 

ఆ యుగ పురుషుడు ప్లస్ శక పురుషుడి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా.. మే 27వ తేదీన పసుపు పార్టీ పండుగ.. మహా పండగ.. మహానాడు ప్రారంభం కానుంది. మరోవైపు ఆ కథానాయకుడు ప్లస్ మహానాయకుడు శత జయంతి వేడుకలు  రాజమహేంద్రవరంలో జరిగే  మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఆ క్రమంలో ఈ మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నగారి ఆత్మబంధువులు.. లక్షలాదిగా తరలిరానున్నారు.  అందుకోసం ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి. 

ఇంకోవైపు.. ఈ ఏడాది చివర లేకుంటే.. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయనే ఓ ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ సైకిల్ పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై అటు అన్ని వర్గాల ప్రజలే కాదు.. ఇటు వివిధ రాజకీయ పార్టీలు, నేతలల్లో సైతం  ఆసక్తి నెలకొంది. ఈ వేడుక వేదికగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని.. అందులోభాగంగా అన్న గారు స్థాపించి పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలను  ఈ వేదికపై నుంచి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జగన్ గద్దెనెక్కిన తర్వాత.. అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం విమర్శనాస్త్రాలు సందించేందుకు తమ మాటలకు పదును పెడుతోన్నట్లు సమాచారం. 

ఇప్పటికే సీఎం  జగన్‌   ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు,ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో  ప్రజల్లో  దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకొని.. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా  అశేష జనాదరణతో ముందుకు సాగుతోంది. ఈ మహనాడు వేదికగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. సమరశంఖం పూరించి.. వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకొనే దిశగా ఈ దర్శనికత కలిగిన అధినేత ఆడుగులు వేయనున్నాయనే ఓ చర్చ సైతం సైకిల్ పార్టీ శ్రేణుల్లో ఊపందుకొంది.

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.