కడప గడ్డన ముగిసిన మహా సంబరం

Publish Date:May 29, 2025

Advertisement

 

రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు .ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు ,కార్యకర్తలు అభిమానులు రావడంతో కడప ఈ మూడు రోజులు మినీ సమైక్యాంధ్ర ను తలపించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుల ప్రసంగాలు ఆకట్టు కొనడమే కాదు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ మాట్లాడం వారిలో  మరింత భరోసా నింపింది .అందరి నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది.

*కడప వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక 

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు ఈసారి కడపలో నిర్వహించడంతో మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కడప వేదికైంది .ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలకు సేవలకు జోష్ నింపారు .మీకు నేనున్నాను పార్టీ ఉంది మనం కష్టపడదాం ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇచ్చారు.

*కలివిడిగా లోకేష్ 

రాష్ట్ర సాంకేతిక ,విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడ తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో  ముచ్చటిస్తూ వచ్చారు. మీడియా పాయింట్ లో సైతం అయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని జర్నలిస్టు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీదే కుర్చీలో కాకుండా ఒక వారన క్రింద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడా విసిగించుకోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం ఇవ్వడం ఆయన పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు.

*ప్రత్యేక ఆకర్షణగా యన్టీఆర్ గ్యాలరీ.

మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది .మొదటి రెండు రోజుల్లో ప్రతిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటుచేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోను ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది .ఎన్టీఆర్ గారి తో పాటు దాని పక్కన చంద్రబాబు ,లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీ లో ఫోటోలు తీసివేయడంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు.

*అనుకూలించిన వాతావరణం

మహానాడు మరో నాలుగు రోజుల్లో మొదలవుతుందన్న ప్పట్నుంచి వర్ష వస్తుందేమో అన్న ఆందోళన కలిగిస్తూనే వస్తోంది .మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవడంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ ల చుట్టూ ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తవ్వించారు . 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు ముగిసే‌వరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడడంతో మహానాడు మరింత విజయవంతం కావడానికి కారణం అయ్యింది . టిడిపి నాయకులు కూడా ఊపిరి పిల్చుకున్నారు.

*సీమగడ్డన వరాల జల్లు 

కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడప తో పాటు రాయలసీమ వాసులు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలు ఇస్తారని భావించడం సహజమే.. అయితే అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట బోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా  ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సీమను కరువు సీమగా ,ఎడారి సీమ గా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీ నీవా-నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .సీమ ప్రాజెక్టులకు 3500 కోట్లు కట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది పోలవరం తర్వాత ఎక్కువ స్టైల్ నిధులు కట్ చేసిన ప్రాజెక్టు పందిరి అని అన్నారు 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని పోలవరంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యం అని తన సంకల్పాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిని అగ్రభాగంలోని బాధ్యత తమదే అని హామీ ఇవ్వడం జరిగింది.

*ఉక్కుకు మోసులు

కడుపుతో పాటు  రాయలసీవాసులు ఎప్పుడెఎప్పుడా  అని ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.దాదా20ఏళ్ళు గా 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు తప్ప పూర్తి  చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని రెండు దశల్లో రూ,9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ లో  3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని,ఈ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు నేనే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పడం పై ఇక్కడి వాసుల్లో నమ్మకం కుదురుతోంది. పర్యాటపరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో అంతా టూరిజమే‌అని చెబుతూ గండికోట అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం,తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు .మహానాడు కడపలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సీమవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.