Publish Date:May 28, 2025
తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్ తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడింది, ప్రజల కోసమే పని చేసిందని చెప్పారు. నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం ప్రస్థానంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ జెండాను వదల కుండా మోసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పిన లోకేష్.. మరో నాలుగు దశాబ్దాలు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు అవసరమైన అంశాలపై మహానాడు వేదికగా సమగ్ర చర్చ జరగాలన్నారు.
ఇక పార్టీ అధినేత చంద్రబాబు అయితే పార్టీ పటిష్ఠత, రాష్ట్రఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన ఆలోచనలు, ప్రణాళికలను తొలిరోజు మహానాడు వేదికపై ఆవిష్కరించారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తేడాలను కళ్లకు కట్టారు. ఇక కార్యకర్తల విషయంలో జగన్ అధికారంలో ఉన్నసమయంలో ఒకలా.. అధికారం కోల్పోయిన తరువాత మరోలా మాట్లాడుతున్న తీరును చక్కగా ఎండగట్టారు. అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తల నిబద్దత, పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకోవడమే కాకుండా.. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను వృధాకానివ్వబోమని భరోసా ఇచ్చారు. అయితే అది ఒట్టి భరోసా మాత్రమే కాదని ఇప్పటికే ఆచరణలో చేసి చూపడంతో కార్యకర్తలలోనే కాదు, ప్రజలలోనూ వారి పట్ల విశ్వసనీయత పెరిగింది. మొత్తం మీద మహానాడు తొలి రోజు సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఇనుమడింప చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నాయకులు, మహానాడు వేదికగా చేసిన తీర్మానాలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-mahanadu-1st-dat-super-success-39-198824.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.