కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేస్తున్నదెవరు?

Publish Date:Oct 6, 2015

Advertisement

చంద్రబాబుకు మిత్రుడు, సమకాలీకుడైన కరణం బలరాం రాజకీయ భవిష్యత్ ఎందుకు అయోమయంలో పడింది, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పడు చక్రం తిప్పిన నాయకుడు ఎందుకు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది, ఏళ్లతరబడి తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నా కరణంను అధిష్టానం ఎందుకు పక్కనబెడుతోంది? కరణం బలరాం ప్రతిష్ట మసకబారడానికి కారణమెవరు? చంద్రబాబా? చినబాబా? లేక తన పతనాన్ని తానే స్వయంగా బలరాం కోరి తెచ్చుకున్నాడా?

పీవీ హయాంలో ఒకసారి కాంగ్రెస్ లోకి వెళ్లొచ్చినా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న నాయకుడు కరణం బలరాం, ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కరణం... ఎక్కువగా గ్రూప్ లను ప్రోత్సహించేవారని ఆరోపణలున్నాయి, బలరాం నడిపిన వర్గ రాజకీయాలతోనే ప్రకాశం జిల్లాలో టీడీపీ దెబ్బతిందంటారు, కరణం వ్యవహారశైలి కారణంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడిపోయారని అతని ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఒకప్పుడు కరణం బలరాం నడిపిన గ్రూప్ రాజకీయాలే చివరికి అతని రాజకీయ పతనానికి దారితీశాయని, ఎంతో ఎత్తుకు ఎదిగిన బలరాం... అదేరీతిలో కిందికి పడ్డారని అంటున్నారు.

కరణం బలరాం తీరుతో విసిగివేసారిపోయిన చంద్రబాబు... కావాలనే అతడ్ని పక్కనపెట్టారని టీడీపీ నేతలు చెబుతుంటారు, కరణం వ్యవహార శైలి కారణంగానే ప్రకాశం జిల్లాలో పార్టీ దెబ్బతిందని హైకమాండ్ భావించిందని, అందుకే బలరాం వ్యతిరేకించినప్పటికీ లోకేష్ పట్టుబట్టిమరీ దామరచర్ల జనార్దన్ ను  జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారని చెబుతున్నారు, ఒకవేళ బలరాం గెలిచుంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేదని, దాంతో ప్రకాశం జిల్లా టీడీపీ... గ్రూపు రాజకీయాలతో సతమతమయ్యేదని, కానీ కరణం ఓటమితో ఆ బాధ కూడా తప్పిందని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్.

అయితే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తించిన లోకేష్...  అజాత శత్రువు, సీనియర్ లీడరైన మాగుంట శ్రీనివాసులురెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, మాగుంటకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలోని రెడ్డి కమ్యూనిటీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారని చెప్పుకుంటున్నారు. కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేసి, మాగుంటను మెయిన్ ట్రాక్ ఎక్కించడంలో లోకేష్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి

కరణం బలరాం రాజకీయ పతనానికి ఆయనే కారణమని, బలరాం నడిపిన గ్రూపు రాజకీయాలే చివరికి ఆయన్ని దెబ్బతీశాయని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలంటున్నారు, తన వ్యవహార శైలితో తన రాజకీయ పతనాన్ని తనే కొనితెచ్చుకున్నాడని సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు, టీడీపీ హైకమాండ్ కూడా కరణంతో విసిగిపోయే పక్కనబెట్టిందంటున్నారు

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.