ఎమ్మెల్యే బంధువులకు కాదు.. పేదలకు పంచండి! 

Publish Date:May 25, 2021

Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు కావాలంటూ ఆనందయ్య మందును పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే తన బంధుమిత్రులు, వ్యాపారస్తులకు ఇచ్చేందుకు మాత్రం ఈ అనుమతులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనందయ్యకు భద్రత కల్పిస్తున్నామని బయటకు చెబుతూ ఆయనను.. ఎమ్మెల్యే నిర్బంధంలో ఉంచుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆనందయ్యను నిర్బంధంలో ఉంచి ఎమ్మెల్యే మందు చేయించుకుంటుంటే జిల్లా మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని నిలదీశారు. కనీసం కృష్ణపట్నం వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అనధికారికంగా నిర్బంధంలో తయారుచేయించి చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశం కృష్ణపట్నంలో టీడీపీ బృందం పర్యటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,  పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్.శివప్రసాద్ తదితరులు ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆనందయ్య లేకపోవడంతో ఆయన భార్యతో మాట్లాడి వచ్చారు. ఆనందయ్య ఆధ్వర్యంలో సాఫీగా జరిగిపోతున్న ఆయుర్వేదం మందు పంపిణీని ఈ నెల 17న ఆపివేశారని ఈ సందర్భంగా సోమిరెడ్డి ఆరోపించారు. మళ్లీ ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించడంతో 40 వేల మంది వరకు వచ్చారని...గొడవ చోటుచేసుకుని లాఠీచార్జీకి దారితీసిందని చెప్పారు.  ఆయుర్వేదం మందుకు మొదట ఐసీఎంఆర్ అనుమతి కావాలన్నారు..తర్వాత అవసరం లేదనన్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఆయుష్ బృందం  ఆనందయ్య ఆయుర్వేదానికి ఓకే చెప్పినా..  ఇప్పుడు మళ్లీ కేంద్ర బృందం నుంచి అనుమతులు రావాలంటున్నారని అన్నారు. అనుమతుల పేరుతో ఆనందయ్య మందును పేదలకు మాత్రం పంపిణీ చేయించకుండా అడ్డంకులు పెట్టారని మండిపడ్డారు. 

ఇది కృష్ణపట్నం గ్రామానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదని జాతీయ స్థాయి అంశమని సోమిరెడ్డి అన్నారు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్న దేవుడు ఆనందయ్య అని చెప్పారు. ఆనందయ్యకు మద్దతుగా విద్యార్థులు పోరాడాలని సోమిరెడ్డి పిలుపిచ్చారు. ఎమ్మెల్యేని కాదని ఆనందయ్య ఊరుకు వచ్చే దమ్ము మంత్రులు, ఎస్పీలకు లేదన్నారు. హెల్త్ మినిస్టర్ కు అసలు ఓపికే లేదన్నారు. అనధికారికంగా తయారుచేయించుకుని చీకట్లో పంపిణీ చేయించడం ఆపించండి..ఊళ్లోకి తెచ్చి బహిరంగంగా పేదలకు పంపిణీ చేయించండని ముఖ్యమంత్రిని కోరింది టీడీపీ బృందం ప్రత్యేక ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు మధ్య టైమ్ స్లాట్ ప్రకారం అందరికీ మందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆనందయ్యను నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.