ఆదివారమా... విధ్వంస వారమా?

Publish Date:Jun 19, 2022

Advertisement

ఏపీలో ప్రభుత్వ అరాచకం పరాకాష్టకు చేరుకుంది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగిపోతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రజా సమస్యలపై గళమెత్తినా ఖబడ్డార్ అంటూ ఇళ్లపైకి  బుల్ డోజర్ పంపించే విధానానికి తెరతీసింది.   కేసులకు భయపడటం లేదని భావించిందో ఏమో ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా విపక్ష నేతల నివాసాల కూల్చివేతలకు తెగబడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నివాసాలను బుల్ డోజర్లతో కూల్చివేయడానికి సిద్ధ పడుతోంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసంపైకి అధికారులు తెల్లవారు జామున బుల్ డోజర్ తో వచ్చి ఆయన ఇంటి కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు.

రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. నోటీసులు ఎప్పుడో ఇచ్చిమని చెబుతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడి కుమారులు మాత్రం నోటీసులు అందలేదనీ, కూల్చివేత అనంతరం తాము నోటీసులేవి అని అడిగితే పాత తేదీతో నోటీసును తీసుకువచ్చి గోడకు అంటించారనీ చెబుతున్నారు. అలాగే ఆక్రమణ విషయంలో కూడా అధికారులు చెబుతున్న మాటలలో తడబాటు కనిపిస్తోంది. 0.2 సెంట్లని ఒకసారి, రెండు సెంట్లు అని ఒకసారి చెబుతున్నారు.

అసలు ఆక్రమణ ఎంత, ఎప్పుడు ఆక్రమించారు. ఆక్రమణకు సంబంధించి సర్వే ఎప్పుడు చేశారు వంటి వివరాలు అడిగినా కూడా అధికారులు చెప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాగున్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టిన రీతిలో నర్సీపట్నంలోని అయ్యన్ప పాత్రుడి ఇంటిని అధికారులు, పోలీసులు అలా చుట్టుముట్టారు. ఇంటి కూల్చివేత సంగతి తెలియగానే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అయ్యన్ప పాత్రుడి నివాసానికి చేరుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. అక్కడే టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం అధినేత సహా పలువురు తెలుగుదేశం నాయకులు ప్రభుత్వ చర్యన ఖండించారు. రాష్ట్రం కోసం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ను పోలవారంగా మార్చి ప్రతి వారం సందర్శించి పనులను పరుగులు పెట్టిస్తే.. జగన్ అందుకు భిన్నంగా ఆదివారం విధ్వంస వారంగా  మార్చి విపక్ష నాయకుల ఇళ్ల ధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న అయ్యన్ప పాత్రుడిపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గూండా రాజుగా ఏపీ సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని,  జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలుగా జరుగుతూ పోలీసుల అతిప్రవర్తనకు అదుపు లేకుండా పోయింది. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తుల అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో తెలియడానికి జగన్ మూడేళ్ల పాలనే ఉదాహరణ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

జగన్ యూపీలోని యోగి ని ఆదర్శంగా తీసుకుని బల్ డోజింగ్ విధానాన్ని ఏపీకి తీసుకు వచ్చారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఏదో శత్రుదేశం మీదకు యుద్ధానికి వెళుతున్న రీతిలో పోలీసు బలగాలను మోహరించి.. నివాసం కూల్చివేతకు ఉపక్రమించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక రాజకీయ పరిశీలకులు కూడా ఈ కూల్చివేతను ఖండిస్తున్నారు. నిజంగా ఆక్రమణ ఉంటే అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని అంటున్నారు. ఇవ్వని నోటీసులను పాత తేదీలతో సృష్టించి మరీ కూల్చివేతలకు పాల్పడటం అంటే ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.   చట్ట విరుద్ధంగా, ఇష్టారీతిన  కూల్చివేతలకు పాల్పడడానికి వీల్లేదని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఉన్నా,   జగన్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులకు చెందిన నివాసాలు, భవనాల కూల్చివేతకు పాల్పడుతోందని అంటున్నారు.   నర్సీ పట్నంలోని అయ్యన్న పాత్రుడి నివాసంపైకి బుల్ డోజర్ తో వచ్చిన అధికారులు ఇంటి వెనుక వైపు ప్రహారీ గోడను కూల్చివేశారు. అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇదంతా చూసి బుల్ డోజర్ డ్రైవర్  అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరో డ్రైవర్ కోసం ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక మిన్నకున్నారు. అయితే తెలుగుదేశం శ్రేణులు అక్కడ నుంచి కదల లేదు. కూల్చివేతకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దిగి వచ్చి ఇంటి సర్వేకు అంగీకరించారు. దీన్ని బట్టే అర్థమౌతోంది సరైన సర్వే జరపకుండానే అధికారులు ఆక్రమణ జరిగిందంటూ కూల్చివేతకు తయారైపోయారనీ, ఇందుకు  ప్రభుత్వంలో పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని.

By
en-us Political News

  
నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులే తన్నుకున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పోలింగ్ బూత్‌లో మా వర్గం వారే ఏజంట్‌గా వుండాలంటే, మావర్గం వారే ఏజెంట్‌గా వుండాలంటూ తన్నుకున్నారు.
అవినాష్ రెడ్డి పైన పేర్కొన్న దుర్మార్గాలన్నీ చేయడానికి ప్రిపేర్ అయినట్టు అర్థమైపోయింది. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా వుండాలి.
జగన్ పార్టీ ఎన్నికల హింసకు శ్రీకారం చుట్టింది. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్‌పై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు.
అరాచక పాలనను అంతం చేయడానికి సమయం వచ్చింది.. కత్తులతో, పోలీస్ లాఠీలతో ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరించిన నియంతను గద్దె దింపేందుకు సమయం ఆసన్నమైంది.. సొంత తల్లినీ, చెల్లెలను ఇబ్బందులు పాలుచేస్తున్న సీఎంకు బుద్ధిచెప్పే అవకాశం వచ్చింది.
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీయే నాకు పోటీ అన్నట్లుగా పీఎం కుర్చీపై గురిపెట్టారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ జరిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
ఇలాంటి వారి మొక్కులు రాజశేఖర్ రెడ్డికి, జగన్‌కి కావాలేమోగానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కి అక్కర్లేదు. నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!!
ఎన్నికల ముందు రోజున జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు ధిక్కార స్వరం వినిపించారు
హైదరాబాద్ నుంచి ఏపీకి ఓటర్లు రాకుండా జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినప్పటికీ లక్షల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొనటానికి చైతన్య రథాల్లో తరలి వస్తున్నారు. 
మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ డెసిషన్ చేతిలోనే వుంది. మీ ఓటు చేతిలోనే వుంది.  మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్
త్రినయని సీరియల్ లో తిలోత్తమగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వేకువ జామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు హైవే నెం.44పై భూత్ పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద రోడ్డు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇదే కారులో పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్ కూడా ఉన్నారు. పవిత్ర మృతి చెందగా, కుటుంబ సభ్యులకు, చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. 
పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళండి. ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్  కు ఒక రోజు ముందు  ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌ని చాలా వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రేపు చూపించబోతున్నారు. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా వున్నారు. అయితే చంద్రబాబు మీద అనుకూలత కంటే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా వుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.