తొలి జాబితాతో తెలుగుదేశంలో జోష్‌.. బెడిసికొట్టిన‌ వైసీపీ ప్లాన్!

Publish Date:Feb 26, 2024

Advertisement

తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి తొలి జాబితా విడుదలతో తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నెల‌కొంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో తెలుగుదేశంలో చేరుతున్నారు.  తెలుగుదేశం,  జ‌న‌సేన కూట‌మి మొద‌టి జాబితాను 118 మందితో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. వీరిలో తెలుగుదేశం అభ్య‌ర్థులు  94 మంది, జ‌న‌సేన అభ్య‌ర్థులుగా 24 మంది ఉన్నారు.

చంద్ర‌బాబు 94 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. జ‌న‌సేనాని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. మిగిలిన 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. బీజేపీ సైతం కూట‌మిలో క‌లిసే అవ‌కాశం ఉండ‌టంతో ఆ పార్టీకి కేటాయించ‌గా.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను వ‌చ్చేనెల మొద‌టి వారంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మొత్తానికి తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా ప్ర‌క‌ట‌న త‌రువాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. జ‌న‌సేన‌, తెలుగుదేశం శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

ఏపీలో ఏప్రిల్ లో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే  జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చెప్పుకోద‌గ్గ‌  అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. దీనికితోడు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగున్న‌రేళ్ల పాల‌న సాగింది. జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక‌, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. కొందరు జనసేన గూటికి చేరారు. మరింత మంది వైసీపీని వీడే యోచనలో ఉన్నారని అంటున్నారు.

 రాష్ట్రంలోని 150కిపైగా స్థానాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న‌ట్లు ఇటీవ‌ల  ఓ స‌ర్వేలో తేలింది.  తాజాగా తెలుగుదేశం, శిన‌సేన కూటమి మొద‌టి జాబితా విడుదల కావ‌డంతో తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణుల్లో జోష్ నెల‌కొంది.  ప‌లు ద‌ఫాలుగా స‌ర్వేలు నిర్వ‌హించి, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను బ‌ట్టి చంద్ర‌బాబు తెలుగుదేశం అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌ చేసి ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా మొద‌టి జాబితా ప్ర‌క‌టించిన త‌రువాత‌ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్న  ప‌రిస్థితి.

తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా  విడుద‌ల తో   ఆ పార్టీ నేతల మ‌ధ్య  విబేధాలు నెల‌కొంటాయ‌ని వైసీపీ అధిష్టానం అంచ‌నా వేసింది.  కానీ, ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో  తెలుగుదేశం, జనసేన నేత‌లు  కలిసి సంబ‌రాలు చేసుకుంటుండ‌టం వైసీపీ అధిష్టానానికి మింగుడుప‌డ‌టం లేదు. పై పెచ్చు విపక్ష పార్టీల జాబితా తరువాత వైసీపీ నుంచే శ్రేణుల వలస ప్రారంభం కావడం ఆ పార్టీ అధినేతకు మరింత ఆందోళన కలిగిస్తోంది.  అయితే  తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయిన వెంట‌నే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌రుస‌గా ప్రెస్ మీట్లు పెట్టి జ‌నసేన‌కు అన్యాయం జ‌రిగిందంటూ జ‌నసేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు విఫల ప్ర‌య‌త్నం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్ర‌బాబుకు బానిస‌గా మారిపోయాడంటూ విమ‌ర్శ‌లు చేశారు. కానీ, వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌టంతో వైసీపీ పెద్ద‌లకు ఓట‌మి బెంగ ప‌ట్టుకుంది.

జన‌సేన అధినేత ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌కు క్లారిటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అనుకున్న స్థానాల్లో విజ‌యం సాధించ‌లేక పోయింద‌ని, క‌నీసం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లోనైనా జ‌నసేన అభ్య‌ర్థులు గెలిచి ఉంటే ప్ర‌స్తుతం పొత్తులో క‌నీసం 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేసేవాళ్ల‌మ‌ని, కానీ, ఆ ప‌రిస్థితి లేక‌పోటంతో త‌క్కువ సీట్లే అయినా క‌చ్చితంగా గెలుస్తామనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో నిలుస్తున్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. దీంతో జ‌న‌సేన  శ్రేణులు సైతం ప‌వ‌న్ మాటల్లో వాస్త‌వాన్ని గ‌మ‌నించి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 

తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా విడుద‌లైన నాటి నుంచి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి  చేరిక‌లు పెరిగాయి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి  నారా లోకేశ్ స‌మ‌క్షంలో భారీ సంఖ్య‌లో వైసీపీ నుంచి  వచ్చి తెలుగుదేశంలో చేరారు.  మ‌రోవైపు మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి భారీ షాక్ త‌గిలింది.  చౌడేప‌ల్లి మండ‌లంలోని ఐదు పంచాయితీల్లోని 150 మందికిపైగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు తెలుగుదేశం గూటికి చేరారు. నాలుగున్న‌రేళ్ల‌ పాల‌న‌లో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని ఈ సందర్భంగా వారు విమ‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజయం ఖాయ‌మ‌ని, చంద్ర‌బాబు సార‌థ్యంలో రాష్ట్రం మ‌ళ్లీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం, జనసేన కూట‌మి  జాబితాను ఆధారం చేసుకుని ఆ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. అవి బెడిసికొట్టాయి. పైపెచ్చు బూమరాంగ్ అయ్యాయి.  వైసీపీ నుంచే భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరుతున్నారు.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.