పొలిటికల్ లయన్స్ క్లబ్ సర్వే.. వైసీపీ 34 స్థానాలు గెలిస్తే గొప్పే!

Publish Date:Dec 20, 2023

Advertisement

ఏపీలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించనుంది?,  సీఎం ఎవరు అవుతారు? పలు సర్వేల ఫలితాలు  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారనీ బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. అయితే  ఒకటీ అరా సర్వేలు మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనీ, అది కూడా గతం కంటే ఎక్కువగా స్థానాలు గెలుచుకుని మరీ అధికారంలోకి వస్తుందనీ  చెప్పినా.. ఆ సర్వేల ఉద్దేశ్యం ఏంటి అనేది కూడా పరిశీలకులు తేల్చేస్తున్నారు.  వైసీపీకి అనుకూల సర్వేలలోకి గెలిచే స్థానాలు చూస్తే.. ఇది ఎంత ఫేక్ అనేది స్పష్టంగా తెలిసిపోతుందంటున్నారు. అదే  తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచే అవకాశాలున్నాయంటూ చెప్పిన పలు సర్వేలు, ఆ సర్వేలలో తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు విజయం సాధించే స్థానాలను గమనిస్తే.. ఆ సర్వేలన్నీ ప్రజల అభిప్రాయాలకు దగ్గరగా ఉంటున్నాయని చెబుతున్నారు.  ఇప్పుడు తాజాగా పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సంస్థ సర్వే  ఫలితం కూడా జగన్ కు ఏపీ ప్రజలు మరో చాన్స్ ఇచ్చేది లేదని విస్పష్టంగా నిర్ణయం తీసేసుకున్నారని తేల్చింది.  ఆ సర్వేలో  తెలుగుదేశం, జనసేన కూటమి అత్యధిక స్థానాలలో విజయం సాధించడం ఖాయమని పేర్కొంది.తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభంజనంలో మంత్రులు కూడా చిత్తుగా ఓడిపోతారని ఆ సర్వే ఫలితం పేర్కొంది.   ప్రసాద్ కందెగుల అనే అనలిస్ట్ సారథ్యంలో నడుస్తున్న పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సంస్థ వెల్లడించిన ఈ ఫలితం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఒక్కసారి గత ఎన్నికల ఫలితాలకు వెళ్తే వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలు గాను 151 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను వైసీపీ   సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశాక.. తొలి ఆరు నెలలలోనే ప్రజలలో అసంతృప్తి మొదలైంది. అది కాస్తా నాలుగేళ్ళ కాలం తిరిగేసరికి ప్రజలలో తీవ్ర వ్యతిరేకతగా మారింది. సంక్షేమం అమలు, అభివృద్ధిలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు. దానికి తోడు కక్షసాధింపులతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ వ్యతిరేకత ద్విగుణీకృతం, త్రిగుణీకృతంగా పెరిగిపోయింది. అదే ఇప్పుడు ప్రజలు ఎన్నికలెప్పుడొచ్చినా జగన్ ను గద్దెదింపి తీరుతాం అన్న నిర్ణయానికి వచ్చేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పరిశీలకుల విశ్లేషణలకు, జనం మూడ్ కు అద్దంపట్టేలా  పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సర్వే ఫలితం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలోని 175 స్థానాలలో 141 స్థానాలలో జయకేతనం ఎగురవేస్తుందని, వైనాట్ 175 అని చెప్పుకుంటున్న అధికార వైసీపీ మాత్రం   34 సీట్లకు మాత్రమే పరిమితమౌతుందని సర్వే ఫలితం పేర్కొంది.  

చంద్రబాబు, పవన్  రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా  అత్యధిక మెజార్టీ తో విజయం సాధించడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది.  ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈసారి కూడా ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన కూటమి, వైసీపీ వినా మరో పార్టీకి చాన్స్ లేదని తేల్చేసింది అంటే వచ్చే ఎన్నికలలో కూడా  జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీ అసెంబ్లీలో ఖాతా తెరిచే అవకాశాలు లేవని సర్వే ఫలితం పేర్కొంది.  ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందన్న విషయాన్ని కూడా సర్వే పేర్కొంది. 

ఈ పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలసిస్ సర్వే ఫలితం ప్రకారం   రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొంత మేర మాత్రమే వైసీపీ ప్రభావం చూపుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి అధికార వైసీపీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన స్థానాలలో కూడా జిల్లాకు ఒకటి రెండు సీట్లు మినహా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవని సర్వే తేల్చింది.  రాయలసీమ నుండి కడప, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కోడుమూరు, పాణ్యం, పత్తికొండ, ఆలూరు, సింగనమల, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు.. ఉత్తరాంధ్ర నుండి కురపం, పాలకొండ, చీపురుపల్లి, వీ మాడుగుల, అరకు వ్యాలీ, పాయకరావు పేట.. ఉభయ గోదావరి నుండి పెద్దాపురం, అనపర్తి, రంపచోడవరం.. కోస్తాఆంధ్ర నుండి గోపాలపురం, గుడివాడ, పామర్రు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు స్థానాలలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనీ,  మిగతా 141 స్థానాలలో టీడీపీ,జనసేన కూటమి జయకేతనం ఎగురవేస్తుందని సర్వే ఫలితం తేల్చింది. ఇప్పుడీ సర్వే ఫలితం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.